రాష్ట్ర అవతరణ రోజున  రైతుల ధర్నా 

రాష్ట్ర అవతరణ రోజున  రైతుల ధర్నా 

తెలంగాణ దశబ్ది ఉత్సవాల రోజున రైతన్నలు ఆందోళన చేపట్టారు. ధాన్యం కొనుగోళ్ల తీరుపై అన్నదాతలు మండిపడుతున్నారు. ధాన్యం తరలింపులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని నిరసనగా రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల ఎక్స్ రోడ్డుపై ఎగ్లాస్ పూర్ రైతుల ధర్నా దిగారు.

రైతులను రోడ్డుపాలు చేసి ధాన్యం కొనుగోలు చేయకుండా ప్రజాప్రతినిధులు, నాయకులు రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకుంటున్నారంటూ రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కోనరావుపేట మండల పరిషత్ కు వెళుతున్న ఎంపీపీని రైతులు అడ్డుకున్నారు. తరలించిన ధాన్యాన్ని సైతం మిల్లర్లు దించుకోడం లేదని వెంటనే ధాన్యాన్ని కొనాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు.