కౌడిపల్లి, వెలుగు: కౌడిపల్లి కొనుగోలు కేంద్రంలో తూకం వేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు గత15 రోజుల నుంచి లారీలు రావడంలేదని రైతులు శనివారం కౌడిపల్లి బస్టాండ్ వద్ద హైదరాబాద్ - - మెదక్ నేషనల్ హైవే మీద ధర్నా చేపట్టారు. లారీలు రాకపోవడంతో అకాల వర్షం భయంతో ఎవరి ధాన్యం బస్తాల వద్ద వారు రోజుల తరబడిగా పడిగాపులు కాయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారులు స్పందించి లారీలు తెప్పించి ధాన్యం మిల్లులకు తరలించాలని డిమాండ్ చేశారు. మహమ్మద్ నగర్ సొసైటీ సీఈవో దుర్గాగౌడ్ ధర్నా వద్దకు చేరుకుని తహసిల్దార్ కృష్ణకు ఫోన్ చేయగా రెండు లారీలు పంపిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు.
