కడెం హైవేపై రైతుల బైఠాయింపు

కడెం హైవేపై రైతుల బైఠాయింపు

 నిర్మల్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని మేడంపల్లి సదర్మాట్ ఆనకట్ట నుంచి సదర్మాట్ ఆయకట్ట చివరి పంటల వరకు సాగునీటిని అందించాలని రైతులు ఆందోళన చేశారు.  కడెం మండలంలోని కొత్త మద్దిపడగ,పాత మద్దిపడగ, లక్ష్మీ సాగర్ గ్రామాల రైతులు కడెం మండలంలోని ధర్మాజీపేట వద్దనున్న ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా, రాస్తారోకో చేశారు. 

ALSO READ :- మహబూబ్ నగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా మన్నె శ్రీనివాస్ రెడ్డి

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇరిగేషన్ అధికారుల  సూచనల మేరకే తాము సదర్మాట్ ఆయకట్ట కింద పంటలు సాగు చేస్తున్నమన్నారు.  అయితే ఇప్పుడు ధర్మాజీపేట్ వరకు మాత్రమే సాగునీటిని విడుదల చేసి కొత్త మద్దిపడగ, పాత మద్దిపడగ, లక్ష్మీ సాగర్ గ్రామాల రైతుల పంటలకు సాగునీటిని విడుదల చేయడం లేదన్నారు. దీంతో పంటలు ఎండిపోతున్నాయన్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదన్నారు.  వెంటనే  సాగునీటిని విడుదల చేస్తామని  హామీ ఇస్తేనే ధర్నా విరమిస్తామన్నారు. ఘటన స్థలానికి కడెం ఎస్సై  రాజు చేరుకొని రైతులతో మాట్లాడుతున్నారు. సంబంధిత ఇరిగేషన్ అధికారి  డబ్బులు తీసుకొని వేరే గ్రామాల వాళ్లకు సాగునీటిని విడుదల చేస్తున్నారని రైతుల ఆరోపించారు. వెంటనే సంబంధిత అధికారిని సస్పెండ్ చేయాలని రైతుల డిమాండ్ చేశారు