పార్లమెంట్ వైపు దూసుకొస్తున్న రైతులు.. ఢిల్లీలో హై అలర్ట్

పార్లమెంట్ వైపు దూసుకొస్తున్న రైతులు.. ఢిల్లీలో హై అలర్ట్

నిత్యం రద్దీగా ఉండే ఢిల్లీ రహదారులు రైతుల ఆందోళనలతో మరింత రద్దీగా మారాయి. నష్టపరిహారం పెంపు సహా పలు డిమాండ్లపై  రైతులు తమ నిరసనను ఉధృతం చేసి గ్రేటర్ నోయిడా నుంచి గురువారం పార్లమెంటు వైపు కవాతు చేశారు.   రైతుల ఆందోళన క్రమంలో ఢిల్లీ-నోయిడా సహా చిల్లా సరిహద్దు వద్ద భద్రతా బలగాలు పెద్ద ఎత్తున మొహరించాయి.  24 గంటల పాటు అన్ని సరిహద్దులను మూసివేస్తున్నట్లుగా పోలీసులు ప్రకటించారు. అన్ని సరిహద్దుల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేస్తూ సెక్షన్ 144  విధించారు.  

గ్రేటర్ నోయిడాలో రైతులు ఎన్నో నెలలుగా ఆందోళనలు చేపడుతున్నారు. తమ భూములను సేకరించిన అధికారులు వాటికి సరైన విధంగా పరిహారం చెల్లించలేదని మండి పడుతున్నారు. తమ డిమాండ్‌ని నెరవేర్చాలంటూ పార్లమెంట్‌ వైపు మార్చ్‌కి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే పోలీసులు వారిని అడ్డుకున్నారు. 

దీనిపై - పోలీస్ ఉన్నతాధికారులు  మాట్లాడుతూ.. అన్ని సరిహద్దుల్నీ వచ్చే 24 గంటల పాటు మూసేస్తున్నామని.. సెక్షన్ 144 విధించామన్నారు. అన్ని సరిహద్దు ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని..  రైతులతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నామని  స్పష్టం చేశారు.