
రాయపర్తి, వెలుగు: వరంగల్ జిల్లా రాయపర్తి మండలం తిర్మలాయపల్లిలో పీఏసీఎస్ డైరెక్టర్ ఇంట్లో అక్రమంగా యూరియా బస్తాలు నిల్వ చేశాడని ఆదివారం రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఇచ్చేందుకు వచ్చిన లోడ్లోని పది బస్తాల యూరియాను పీఏసీఎస్ డైరెక్టర్ దొంతర బోయిన యాదగిరి తన ఇంట్లో నిల్వ చేసు కున్నాడు.
విషయం తెలుసుకున్న పలువురు రైతులు అక్కడకు చేరుకోవడంతో తన పొలం కోసం దొరకదేమోనని కొన్నిబస్తాలు తీసుకున్నను డైరెక్టర్ ఒప్పుకున్నాడు. ఈ క్రమంలో వ్యవసాయాధికారి గుమ్మడి వీర భద్రం విచారణ జరిపిన వ్యవసాయాధికారి 26 యూరియా బస్తాలు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. డైరెక్టర్ ఇంట్లో ఉన్నబస్తాలను పంచాయతీకి తరలించి, విచారణ చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు.