డిగ్గర్తో రైతులకు డబ్బు ఆదా

డిగ్గర్తో రైతులకు డబ్బు ఆదా

చిన్నచింతకుంట, వెలుగు: డిగ్గర్​ యంత్రంతో వేరుశనగ తీయడం ద్వారా రైతులకు డబ్బు ఆదా అవుతుందని నూనె గింజల శాస్త్రవేత్త వాణిశ్రీ తెలిపారు. మండలంలోని అమ్మపూర్  గ్రామానికి చెందిన రైతు నాగరాజు పల్లి చేనులో శుక్రవారం యంత్రం పనితీరును పరిశీలించారు. 

యంత్రాన్ని ప్రదర్శించి, రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటిస్తే తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించవచ్చన్నారు. ఆరుతడి పంటలపై రైతులు ఆసక్తి చుపాలని, రెండు పంటలు వరి వేయడం వల్ల చౌడు భూమిగా మారుతుందన్నారు. పాలెం శాస్త్రవేత్తలు డాక్టర్  శ్రావణ కుమార్, నవత, మస్తానయ్య మాట్లాడుతూ రైతులు యాంత్రీకరణకు మొగ్గు చూపితే సహకరిస్తామని తెలిపారు. సైంటిస్టులు విజయలక్ష్మి, స్రవంతి, ఏవో రాజేశ్ ఖన్న, ఏఈవో సంతోష్  పాల్గొన్నారు.