
ఆమనగల్లు, వెలుగు: తలకొండపల్లిలో గురువారం యూరియా కోసం రైతులు పీఏసీఎస్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. గోదాంలో లారీ లోడ్ యూరియా ఉన్నప్పటికీ, పంపిణీ చేయకుండా యూరియా లేదని చెప్పి సిబ్బంది తాళం వేసి వెళ్లిపోవడం అన్యాయమన్నారు.
ఈ విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, యూరియా పంపిణీ చేశారు. రామస్వామి, మంజుల, శ్యామల, నరసింహ, చందు నాయక్, జంగయ్య, కృష్ణ, షానమోని పాండు, నీలకంటి పాండు, పద్మ అనిల్, వినయ్, శివ, రాజు, సురేశ్ పాల్గొన్నారు.