ఐకేపీ సెంటర్లో వడ్లు కొనడంలేదని రైతులేం చేశారంటే..

ఐకేపీ సెంటర్లో వడ్లు కొనడంలేదని రైతులేం చేశారంటే..
  • వడ్ల కాంటాలతో రోడ్డు దిగ్బంధం చేసి ధర్నా

జనగామ జిల్లా: దేవరుప్పుల మండలం ధరావత్ తండాలో రైతులు ఆందోళనకి దిగారు. ఐకేపీ సెంటర్లో వడ్లు కొనుగోలు చేయడం లేదంటూ రాస్తారోకో చేశారు. వడ్ల కంటాలతో రోడ్డు దిగ్బంధం చేసి ధర్నా చేశారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. రైతుల్ని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. వర్షం పడితే చేతికొచ్చిన పంట తడిసిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి పండించిన పంట వానల పాలు అవుతుంటే చూస్తూ ఉండిపోవాలా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు అధికారులేమో వడ్లు కొంటామని చెబుతుంటే ఇక్కడ మాత్రం కొనడం లేదని.. రోజూ హఠాత్తుగా కురుస్తున్న వానలతో ధాన్యాన్ని ఎలా కాపాడుకోవాలని వారు ప్రశ్నించారు. ప్రభుత్వం స్పందించి అధికారులు వెంటనే  వెంటనే ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

 

 

 

ఇవి కూడా చదవండి

ముగ్గురు వ్యాపారవేత్తలకు రాజ్యసభ సీట్లు

ఎస్సీ ఉప కులాలకు చట్ట సభల్లో అవకాశమివ్వాలె