పర్వతగిరి/ హసన్పర్తి, వెలుగు: రైతులు తాము పండించిన పంటలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి, మద్దతు ధర పొందాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. సోమవారం వరంగల్ జిల్లా పర్వతగిరి, ఏనుగల్లు, హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం వంగపహాడ్, నాగారం గ్రామాల్లో మార్క్ఫెడ్ సహకారంతో ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రాలను ఆయన వరంగల్ డీసీసీ అధ్యక్షుడు ఆయూబ్, కుడా చైర్మన్ వెంట్రామిరెడ్డితో కలిసి ప్రారంభించారు.
