మెట్‌పల్లిలో రోడ్లపై వడ్లను ఆరబెట్టుకోవడానికి బతుకమ్మ చీరలను వాడుతున్న రైతులు

మెట్‌పల్లిలో రోడ్లపై వడ్లను ఆరబెట్టుకోవడానికి బతుకమ్మ చీరలను వాడుతున్న రైతులు

తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీపై మొన్నటివరకూ పలువురు మహిళలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నాసిరకం చీరలు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. అయితే తాజాగా ఈ చీరలకు సంబంధించిన వార్త మరోసారి వైరల్ గా మారింది. కొందరు రైతులు ఈ చీరలను తమ వ్యవసాయ పనుల్లో వాడుతున్నారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కోరుట్లలోని మెట్ పల్లిలో జరిగింది. కొందరు రైతులు రోడ్లపై వడ్లను ఆరబెట్టడానికి బతుకమ్మ చీరలను ఉపయోగిస్తున్నారు. 

రాష్ట్రంలో18 సంవత్సరాలు నిండిన ఆడబిడ్డలందరికీ బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కానుకగా బతుకమ్మ పేరుతో చీరలందిస్తోంది. మరమగ్గ నేతన్నలకు ఉపాధి కల్పించటంతోపాటు అడపడుచులకు ప్రేమపూర్వక చిరుకానుక అందించే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టింది. 2017లో తీసుకొచ్చిన ఈ కార్యక్రమం ఇప్పటివరకూ అలానే కొనసాగుతుండగా.. ఆరంభంలో బాగానే ఉన్నా... రాను రాను అది ప్రజల అసంతృప్తికి దారి తీస్తోంది. ఈ ఏడాది ఆ వ్యతిరేకత మరింత ఎక్కువైనట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఒక్కొక్కరూ ఒక్కో విధంగా తమ అభిప్రాయాన్ని ఇలా వెల్లడిస్తున్నారు.