నైరోబి: కెన్యాలో మంగళవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. క్వాలే ప్రాంతంలో టూరిస్ట్ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో 11 మంది మరణించారు. మాంబాసా ఎయిర్ సఫారీ అనే కంపెనీ నడిపే సెస్నా కారవాన్ రకం ప్లైన్.. డియానీ ఎయిర్‌స్ట్రిప్ నుంచి కిచ్వా టెంబోలో ఉన్న అభయారణ్యం వైపు వెళ్తుండగా కూలిందని అధికారులు తెలిపారు. కిందపడిన వెంటనే మంటలు చెలరేగడంతో విమానం పూర్తిగా కాలి బుడిదయ్యిందని చెప్పారు.
చనిపోయిన 11 మందిలో 8 మంది హంగేరియన్, ఇద్దరు జర్మన్ ప్రయాణికులతోపాటు కెన్యా పైలట్ కూడా ఉన్నాడని వివరించారు. మృతదేహాలు గుర్తించలేనంతగా కాలిపోయాయని పేర్కొన్నారు. విమానం ఎలా కూలిందనే దానిపై కెన్యా సివిల్ ఏవియేషన్ అథారిటీ (కేసీఏఏ), పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
