
సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో దారుణం జరిగింది. భార్య పుట్టింటికి వెళ్లిందనే కోపంతో మద్యం మత్తులో కన్నబిడ్డలను హతమార్చాడు ఓ తండ్రి. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మరణించగా మరోకరికి గాయాలయ్యాయి. సైబరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాంబే కాలనీలో భార్యతో తరచూ గొడవపడేవాడు ఓ భర్త. దీంతో కొన్ని రోజుల క్రితం భార్య పుట్టింటికి వెళ్లింది. ఆ భార్యపై ఉన్న కోపంతో మద్యం మత్తులో మంగళవారం అర్థరాత్రి కన్న పిల్లలపై దాడి చేశాడు తండ్రి. ఈ దాడిలో కుమారుడు అఖిల్(7),కుమార్తె శరణ్య (4) మృతి చెందగా పెద్ద కుమార్తె మల్లీశ్వరి.(10)కి గాయాలయ్యాయి. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.