తండ్రికి కూతురు కిడ్నీ దానం..కన్నతండ్రి కన్నీరు

తండ్రికి కూతురు కిడ్నీ దానం..కన్నతండ్రి కన్నీరు

జన్మనిచ్చిన తల్లిదండ్రుల రుణం తీర్చుకునేందుకు అందరికీ అవకాశం రాదు. వచ్చినా.. ఇప్పుడున్న రోజుల్లో తల్లిదండ్రులను పట్టించుకోకుండా వృద్ధాప్యం రాగానే వారిని అనాథ ఆశ్రమాల్లో వదిలేస్తున్నారు. కాని ఓ మహిళ తన జీవితం ఏమైనా పర్వాలేదు కాని తండ్రి బాగుండాలని తన కిడ్నీ దానం ఇచ్చింది. కన్న కూతురే తనకు కిడ్నీ ఇచ్చిన దాత అని తెలుసుకున్న ఆ తండ్రి భావోద్వేగానికి గురయ్యారు. ఆస్పత్రిలోని వార్డులోకి తన కూతురు రాగానే.. ఆమెను చూసి తానే కిడ్నీ ఇచ్చిందని తెలుసుకుని కన్నీటి పర్యంతం అయ్యాడు. ఎందుకమ్మా ఇంత సాహసం చేశావంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆమె దగ్గరకు వచ్చిన తండ్రిని ఓదార్చింది. ఈ వీడియోను ఫిగెన్ అనే ట్విట్టర్ యూజర్ పోస్టు చేశారు. ఆమె ప్రపంచంలోని అత్యంత అద్భుతమైన కుమార్తెలలో ఒకరంటూ క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటివరకు ట్విట్టర్ లో ఈ వీడియోకు 5 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. 18వేలకు పైగా లైకులు వచ్చాయి.