మా నాన్న లైంగికంగా వేధించాడు : స్వాతి మాలివాల్

మా నాన్న లైంగికంగా వేధించాడు : స్వాతి మాలివాల్

న్యూఢిల్లీ: చిన్నతనంలో తాను కూడా లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మాలివాల్ తెలిపారు. తన తండ్రే తనను వేధించాడ ని ఆవేదన వ్యక్తంచేశారు. శనివారం ఆమె ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘‘నేను నాలుగో తరగతి వరకు నాన్న దగ్గర ఉన్నాను. ఆ టైమ్​లో లైంగికంగా వేధించాడు. ఇష్టమున్నట్టు కొట్టేవాడు. నా తలను గోడకేసి కొడితే, కొన్నిసార్లు రక్తం కూడా వచ్చింది. ఆయన ఇంటికి వచ్చాడంటేనే భయమేసేది. భయంతో మంచం కింద దాక్కునేదాన్ని” అని స్వాతి మాలివాల్ చెప్పారు. 

ఇలా పిల్లలను వేధించేవాళ్లకు ఎలా బుద్ధి చెప్పాలని, మహిళలకు ఎలా అండగా నిలవాలని ప్రతిరోజు ఆలోచించేదాన్ని అని అన్నారు. వేధింపులు ఎదుర్కొన్న వాళ్లే బాధితుల బాధను అర్థం చేసుకో గలరని నమ్ముతున్నట్లు చెప్పారు.