ఇద్దరు కొడుకులను కాల్చి చంపి సూసైడ్ చేసుకున్న తండ్రి

ఇద్దరు కొడుకులను కాల్చి చంపి సూసైడ్ చేసుకున్న తండ్రి
  • మహారాష్ట్రలో దారుణం

నాగ్​పూర్క్షణికావేశంలో ఓ తండ్రి తన ఇద్దరు కొడుకులను గన్​ తో కాల్చి తానూ కాల్చుకుని సూసైడ్ చేసుకున్నాడు. మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా బల్లార్​పూర్ లో మంగళవారం రాత్రి ఈ దారుణం జరిగింది. పెద్దకొడుకు అక్కడికక్కడే చనిపోగా చిన్న కొడుకును నాగ్​పూర్ లోని ఆస్పత్రికి తరలించారు. కుటుంబ గొడవలే ఈ ఘటనకు కారణమని పోలీసులు వెల్లడించారు. ‘‘ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న నాగ్​పూర్ కు చెందిన ముల్ చంద్ ద్వివేది(50) లాక్​డౌన్ ఎఫెక్టుతో బల్లార్​పూర్ లో తన కుమారులతో ఉంటున్నాడు. ముల్​చంద్​కు తన కొడుకులు ఆకాశ్(22), పవన్(20) మధ్య మంగళవారం సాయంత్రం చిన్న గొడవ మొదలైంది. కోపంతో ఉన్న తండ్రి ముల్ చంద్ తన లైసెన్స్ గన్ తీసి ఆకాశ్, పవన్​లను కాల్చాడు. తర్వాత అతను కూడా కాల్చుకున్నాడు”అని పోలీసులు వెల్లడించారు. ఆస్పత్రిలో పవన్ కండిషన్ సీరియస్ గా ఉందని చెప్పారు.

ముల్చంద్ బల్లార్​పూర్ బీజేపీ సీనియర్ నాయకుడు శివచంద్ ద్వివేది సోదరుడు అని గుర్తించారు. చనిపోయిన ఆకాశ్ కూడా బల్లార్ పూర్ లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుండగా.. చిన్న కొడుకు పవన్ ఐస్​క్రీం పార్లర్ నడుపుతున్నాడు. తండ్రీ కొడుకుల మధ్య గొడవకు కారణం ఏంటో నిర్ధారించలేకపోయామని పోలీసుల తెలిపారు.