యూపీలో కూతురిని కాల్వలోకి విసిరేసిన తండ్రి

యూపీలో కూతురిని కాల్వలోకి విసిరేసిన తండ్రి

మీరట్: ఉత్తరప్రదేశ్​లో దారుణం చోటుచేసుకుంది. కన్న కూతురునే ఓ తండ్రి కాల్వలోకి విసిరేశాడు. కొడుకు, కూతురు పదేపదే కొట్లాడుకుంటున్నరని, దీంతో విసిగిపోయి కూతురును కాల్వలోకి విసిరేశానని తండ్రి తెలిపాడు. జిల్లాలోని సర్ధానా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మధియై గ్రామంలో సులేమాన్​ నివసిస్తున్నాడు. శుక్రవారం ఉదయం నుంచి అతడి కుమార్తె కనిపించడంలేదని గ్రామస్థులు గుర్తించారు. గతంలోనూ ఇలాగే ఇద్దరు కూతుళ్లు కనిపించకుండా పోవడంతో అప్రమత్తమయ్యారు. పాప ఏదని అడిగితే పొంతనలేని జవాబివ్వడంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. 

పోలీసులు వచ్చేసరికి సులేమాన్ ఇంట్లో లేడు. ఇంట్లో, ఇంటి చుట్టుపక్కల గాలించినా పా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులు గ్రామంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. సులేమాన్ తన కూతురితోపాటు గ్రామం వెలుపలికి వెళ్లడం  అందులో కనిపించింది. దీంతో సులేమాన్​ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. తన కూతురును గంగా కాల్వలోకి విసిరేశానని చెప్పాడు. సులేమాన్ పై కేసు నమోదు చేసి, బాలిక కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.