కెరీర్​ ఇన్​ ఫుట్​వేర్​ డిజైన్ కోర్సులు.. పోటీ తక్కువ.. డిమాండ్​ ఎక్కువ

కెరీర్​ ఇన్​ ఫుట్​వేర్​ డిజైన్  కోర్సులు.. పోటీ తక్కువ.. డిమాండ్​ ఎక్కువ

ఫుట్‌‌వేర్ డిజైనింగ్, ప్రొడక్షన్, లెదర్ గూడ్స్, యాక్ససరీస్, ఫ్యాషన్ డిజైనింగ్‌‌ కోర్సుల్లో చేరడానికి  ఫుట్‌‌వేర్ డిజైన్ అండ్ డెవలప్‌‌మెంట్ ఇనిస్టిట్యూట్‌‌ వెల్‌‌కమ్ చెప్తోంది. ఇంటర్, డిగ్రీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్  మెరిట్ ఆధారంగా నేరుగా కోర్సుల్లో జాయిన్ కావచ్చు.  దేశవ్యాప్తంగా హైదరాబాద్ సహా 12 చోట్ల ఎఫ్‌‌డీడీఐ క్యాంపస్‌‌లు ఉన్నాయి. యూజీ, పీజీల్లో అన్ని సంస్థల్లోనూ 2,360 సీట్లు ఉన్నాయి. ఆల్‌‌ ఇండియా సెలెక్షన్ టెస్టు (ఏఐఎస్‌‌టీ)లో చూపిన ప్రతిభతో ప్రవేశం లభిస్తుంది.  

ఎఫ్‌‌డీడీఐలో   ఫుట్‌‌వేర్, లెదర్, గూడ్స్,  డిజైన్, ఫ్యాషన్, ఫైన్ ఆర్ట్స్‌‌, ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్, ప్రొడక్షన్, టెక్నాలజీ  విభాగాల్లో  ట్రైనింగ్  ఇస్తారు.  వీటితోపాటు ఫుట్‌‌వేర్ , లెదర్‌‌ గూడ్స్  యాక్సెసరీలు  తయారీ విధానం,  డిజైనింగ్,  కొత్త మోడల్స్ క్రియేట్ చేయడం, రిటైల్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌, కస్టమర్‌‌ బిహేవియర్‌‌, రిటైల్‌‌ కమ్యూనికేషన్‌‌, కస్టమర్‌‌ రిలేషన్‌‌షిప్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌, రిటైల్‌‌ ఆపరేషన్‌‌, మార్కెటింగ్‌‌, బ్రాండ్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌, సేల్స్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌, కంప్యూటర్ సైన్స్, ల్యాబ్ టెస్టింగ్, మార్కెటింగ్,  తదితర అంశాలను నేర్పిస్తారు .  

ఫుట్‌‌వేర్‌‌ డిజైన్‌‌లో ఎఫ్‌‌డీడీఐ దేశంలోనే మేటి సంస్థ. ఈ సంస్థ ఫ్యాషన్‌‌ డిజైన్, ప్రొడక్ట్‌‌ డిజైన్, ఎంబీఏ కోర్సులనూ అందిస్తోంది. ఎఫ్‌‌డీడీఐ సంస్థల్లో కోర్సులు పూర్తిచేసుకున్నవారికి విస్తృతంగా కెరియర్‌‌ అవకాశాలు అందుతున్నాయి. ఫుట్‌‌వేర్‌‌ పరిశ్రమపై ఆసక్తి ఉన్నవారు ఈ సంస్థల్లో చేరి మేటి భవిష్యత్తుకు బాట వేసుకోవచ్చు 

జాబ్​ ఆపర్చునిటీస్​:  ఎఫ్‌‌డీడీఐ సంస్థల్లో డిజైన్‌‌ కోర్సులు పూర్తిచేసినవారికి ఎక్కువగా ఫుట్​వేర్​, దుస్తులు, లెదర్‌‌ ఉత్పత్తులు తయారు చేసే సంస్థల్లో ఉద్యోగాలు దక్కుతున్నాయి. బీబీఏ, ఎంబీఏతో.. ఏరియా మేనేజర్, ఫ్లోర్‌‌ మేనేజర్, స్టోర్‌‌ మేనేజర్, మేనేజ్‌‌మెంట్‌‌ ట్రెయినీ మొదలైన హోదాలతో పాదరక్షలు, తోలు ఉపకరణాలు విక్రయించే సంస్థలు, రిటైల్‌‌ చెయిన్లలో ఉద్యోగాలు ఉంటాయి. ఎక్కువ అవకాశాలు కార్పొరేట్‌‌ రిటైల్‌‌ దుకాణాల్లో లభిస్తాయి. ఫుట్‌‌వేర్‌‌ డిజైన్‌‌ కోర్సులు పూర్తిచేసుకున్నవారికి.. పాదరక్షల తయారీ విభాగంలోని ఉద్యోగాలతోపాటు ఫుట్​వేర్​ విక్రయించే కొలువులూ దక్కుతాయి.  అడిడాస్, యాక్షన్, బాటా, ప్యూమా, గ్లోబస్, ఖాదిమ్స్, లైఫ్‌‌స్టైల్, ల్యాండ్‌‌మార్క్, మ్యాక్స్, రీబక్, లిబర్టీ, రిలయన్స్‌‌ రిటైల్, వెస్ట్‌‌సైడ్, ఉడ్‌‌ల్యాండ్, వీకేసీ, షాపర్స్‌‌ స్టాప్, ప్యాంటలూన్స్‌‌.. మొదలైన సంస్థలు క్యాంపస్‌‌ నియామకాల ద్వారా ఎఫ్‌‌డీడీఐ విద్యార్థులకు అవకాశాలు కల్పిస్తున్నాయి. 

కోర్సుల్లో నేర్పే అంశాలు: కోర్సులో భాగంగా వివిధ పదార్థాలు, ఉత్పత్తులు ఉపయోగించి పాదరక్షలు, తోలు ఉత్పత్తులు, జీవన శైలి ఉపకరణాలు ఎలా తయారు చేయాలో నేర్పిస్తారు. యంత్రాల సాయంతో వాటిని డిజైన్‌‌ చేయిస్తారు. వినియోగదారుల అవసరాలపై అవగాహన కల్పించి, అందుకు అనుగుణంగా ఉత్పత్తులు సృష్టించడంపై దృష్టి సారిస్తారు. వీటితోపాటు రిటైల్‌‌ మేనేజ్‌‌మెంట్, వినియోగదారుల స్వభావం/ఆలోచన తీరు, రిటైల్‌‌ కమ్యూనికేషన్, కస్టమర్‌‌ రిలేషన్‌‌షిప్‌‌ మేనేజ్‌‌మెంట్, రిటైల్‌‌ ఆపరేషన్, మార్కెటింగ్, బ్రాండ్‌‌ మేనేజ్‌‌మెంట్, సేల్స్‌‌ మేనేజ్‌‌మెంట్, కంప్యూటర్‌‌లో ప్రాథమిక పరిజ్ఞానం ...తదితర అంశాల్లో అవగాహన కల్పిస్తారు.  

పోటీ తక్కువ.. డిమాండ్​ ఎక్కువ:  ప్రీవియస్​ పేపర్స్​ గమనించి, సన్నద్ధమైతే రాత పరీక్షను సులువుగానే ఎదుర్కోవచ్చు. వెబ్‌‌సైట్‌‌లో మాదిరి ప్రశ్నలనూ ఉంచారు. వాటిని పరిశీలిస్తే పరీక్షలో ఎలాంటి ప్రశ్నలు వస్తాయో,  వేటిని చదవాలో అర్థం చేసుకోవచ్చు.  ప్రశ్నలు మరీ అంత కఠినంగా ఉండవు. పోటీ పరిమితమే. అందువల్ల ఈ కోర్సులపై ఆసక్తి ఉన్నవారు కొద్దిగా శ్రమిస్తే చాలు సీటు పొందడం తేలికే. తొలుత ఏర్పాటైన నోయిడా క్యాంపస్‌‌కు అభ్యర్థులు మొదటి ప్రాధాన్యమిస్తున్నారు. 

ఎగ్జామ్​ ప్యాటర్న్​: 

యూజీ, పీజీ పరీక్షలను ఆఫ్‌‌లైన్‌‌లోనే విడిగా నిర్వహిస్తారు. క్వశ్చన్​ పేపర్​ ఇంగ్లీస్​ మీడియంలో ఉంటుంది.
యూజీ: 200 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. 4 సెక్షన్ల నుంచి మొత్తం 150 ప్రశ్నలు వస్తాయి. సెక్షన్‌‌ ఏ ఎనలిటికల్‌‌ ఎబిలిటీలో 25 ప్రశ్నలకు 25 మార్కులు. సెక్షన్‌‌ బీలో బిజినెస్‌‌ ఆప్టిట్యూడ్‌‌ టెస్టు 25, డిజైన్‌‌ ఆప్టిట్యూడ్‌‌ టెస్టు 25 ప్రశ్నలు వస్తాయి. ఈ విభాగంలో ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు. సెక్షన్‌‌ సీ జనరల్‌‌ అవేర్‌‌నెస్‌‌ 35 ప్రశ్నలకు 35 మార్కులు. సెక్షన్‌‌ డీ కాంప్రహెన్షన్‌‌ 25, గ్రామర్, యూసేజ్‌‌ మొదలైనవాటి నుంచి 15 ప్రశ్నలు వస్తాయి. వీటికి 40 మార్కులు.   

పీజీ: ఈ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్షలో 4 సెక్షన్ల నుంచి 175 ప్రశ్నలు వస్తాయి. వీటికి 200 మార్కులు. ఎనలిటికల్‌‌ ఎబిలిటీలో 25 ప్రశ్నలకు 50 మార్కులు. ఇంగ్లిష్‌‌ కాంప్రహెన్షన్‌‌ అండ్‌‌ గ్రామర్‌‌ 50 ప్రశ్నలకు 50 మార్కులు. జనరల్‌‌ నాలెడ్జ్‌‌ అండ్‌‌ కరంట్‌‌ అఫైర్స్‌‌ 50 ప్రశ్నలు 50 మార్కులు. మేనేజ్‌‌మెంట్‌‌ ఆప్టిట్యూడ్‌‌ టెస్టు, డిజైన్‌‌ ఆప్టిట్యూడ్‌‌ టెస్టు 50 ప్రశ్నలు 50 మార్కులకు ఉంటాయి.

నోటిఫికేషన్ 

ఎఫ్‌‌డీడీఐ క్యాంపస్: నోయిడా, ఫుర్సత్‌‌గంజ్‌‌, చెన్నై, కోల్‌‌కతా, రోహ్‌‌తక్, జోధ్‌‌పుర్, చింద్వారా, గుణ, అంకలేశ్వర్, పట్నా,హైదరాబాద్, చండీగఢ్.
కోర్సులు: బ్యాచిల‌‌ర్ ఆఫ్ డిజైన్‌‌-నాలుగేళ్లు, బ్యాచిల‌‌ర్ ఆఫ్ బిజినెస్‌‌ అడ్మినిస్ట్రేష‌‌న్‌‌(బీబీఏ)-మూడేళ్లు, మాస్టర్ ఆఫ్ డిజైన్‌‌-రెండేళ్లు, మాస్టర్ ఆఫ్ బిజినెస్​ అడ్మినిస్ట్రేష‌‌న్‌‌(ఎంబీఏ)-రెండేళ్లు. విభాగాలు: ఫుట్​వేర్​ డిజైన్ ​& ప్రొడక్షన్, లెదర్​ గూడ్స్ & యాక్ససరీస్​ డిజైన్​, ఫ్యాషన్ డిజైన్​, రిటైల్​ & ఫ్యాషన్​ మర్చెంటైజ్​​
అర్హత: ఇంట‌‌ర్మీడియ‌‌ట్‌‌, ఏదైనా బ్యాచిలర్స్​, మాస్టర్స్​ డిగ్రీ, సంబంధిత విభాగాల్లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
విభాగాలు: ఫుట్‌‌వేర్ డిజైన్ అండ్‌‌ ప్రొడక్షన్, ఫ్యాషన్ డిజైన్, లెదర్- లైఫ్‌‌స్టైల్ అండ్ ప్రొడక్ట్ డిజైన్, రిటైల్ అండ్‌‌ ఫ్యాషన్మర్చండైజ్.
దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో ఏప్రిల్​ 20 వరకు దరఖాస్తు చేసుకోవాలి. మే 12న పరీక్ష నిర్వహిస్తారు. కౌన్సెలింగ్​ జూన్​లో ఉంటుంది. పూర్తి వివరాలకు www.fddiindia.com
వెబ్​సైట్​లో సంప్రదించాలి.