
నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఫిబ్రవరి 29ని లీప్ ఇయర్ అని పిలుస్తారని తెలిసిందే. అయితే ఈ ఇయర్ ఫిబ్రవరి-29 రావడంతో చాలా మందిలో ఆసక్తి నెలకొంది. ఆ రోజు పుట్టే పిల్లలు నాలుగు సంవత్సరాలకు ఒకసారి బర్త్ డే చేసుకోవాల్సి వస్తుంది. కొందరు కావాలనే మ్యారేజ్ ఫిక్స్ చేసుకున్నామంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
అయితే ఈ లీప్ సంవత్సరం విషయానికొస్తే.. ఇది ఎలా వచ్చిందంటే.. భూమి సూర్యుడి చుట్టూ తిరగడానికి 365 రోజుల 5 గంటల 48 నిమిషాల 46 సెకండ్లు పడుతుంది. అంటే 365 రోజులతో పాటు మరో పావు రోజు పడుతుంది. పావు రోజును తీసుకోలేము కాబట్టి ప్రతి నాలుగేళ్లల్లో నాలుగు పావు రోజుల్ని కలిపితే ఒక రోజు అవుతుంది. సో నాలుగు సంవత్సరాలకు వచ్చే ఎక్సట్రా రోజును లీప్ ఇయర్ గా గుర్తించారు.