ఫీజులు చెల్లించలేదని.. విద్యార్థులను బస్సుల్లో కూర్చోబెట్టారు

ఫీజులు చెల్లించలేదని.. విద్యార్థులను బస్సుల్లో కూర్చోబెట్టారు

ప్రైవేట్ పాఠశాలల ఫీజు దోపిడీ మితిమీరుతుంది. ఫీజులు చెల్లించలేదని.. విద్యార్థులను బస్సుల్లో కూర్చోబెట్టింది స్కూల్ యాజమాన్యం. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ప్రియాంక హై స్కూల్ యాజమాన్యం.. తల్లిదండ్రులు ఫీజులు చెల్లించడం లేదంటూ విద్యార్థులపై తమ ప్రతాపం చూపెడుతుంది. ఉదయం మంచాల, యాచారం మండలంలోని పలు గ్రామాల నుంచి ఉదయం విద్యార్థులకు పాఠశాలకు తీసుకువచ్చిన యాజమాన్యం, పాఠశాలకు దూరంగా మండే ఎండలో ఉంచారు. పాఠశాల బస్సుల పార్కింగ్ లో ఉన్న బస్సుల్లో ఉదయం నుంచి కూర్చోబెట్టి దండిస్తున్నారు.

ఫీజు కట్టని విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు మీడియాకు తెలియడంతో వీడియోలు చిత్రికరిస్తుండగా.. విద్యార్థులను పాఠశాలలోకి మరల పంపించేశారు. ఫీజు చెల్లిస్తామని చెప్పినా వినకుండా విద్యార్థులను ఎండలో కూర్చోబెట్టారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం గురించి మండల విద్యాధికారికి చెప్పినా పట్టించుకోవడం లేదు. ఏది ఏమైనప్పటికి ఫీజుల దోపిడీకి పాల్పడుతూ, విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆ పాఠశాలలపై పర్యవేక్షణ కరువైందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ALSO READ :- అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయిన బండ్లగూడ మేయర్ మహేందర్ గౌడ్