టూల్స్ గాడ్జెట్స్: పెట్ ఫిడర్

టూల్స్ గాడ్జెట్స్: పెట్ ఫిడర్

ఇంట్లో ఎంత మంది ఉన్నా ఒక్కోసారి పెట్స్​కి ఫుడ్‌‌ పెట్టడం మర్చిపోతుంటారు. అలాకాకుండా ఉండాలంటే ఇలాంటి ఫెట్‌‌ ఫీడర్‌‌‌‌ని వాడాలి. ఈ ఆటోమేటిక్ పెట్ ఫీడర్‌‌‌‌ని ఎన్‌‌పీఈటీ కంపెనీ తయారుచేసింది. ఇందులో  6.2 లీటర్ల  డాగ్, క్యాట్ ఫుడ్ డిస్పెన్సర్ ఉంటుంది. ప్రోగ్రామబుల్ టైమర్‌‌‌‌తో ఆటోమెటిక్‌‌గా ఫుడ్‌‌ ఇస్తుంది. టైమర్‌‌‌‌ని కావాల్సినట్టు సెట్ చేసుకోవచ్చు. 

రోజుకు గరిష్టంగా 39 పోర్షన్‌‌ల ఫుడ్‌‌ని ఇచ్చే టైమర్‌‌ ప్రోగ్రామ్ ఇందులో ఉంది. ఇందులో రెండు ట్యాంక్‌‌లు ఉంటాయి. ఒకదానిలో పిల్లి, మరో దానిలో కుక్కకు కావాల్సిన ఫుడ్‌‌ నింపొచ్చు. ఇది బ్యాటరీతో పనిచేస్తుంది. అంతేకాదు.. పెట్స్‌‌ కు ఫుడ్‌‌ ఇచ్చే ముందు వాటిని పిలవడానికి వాయిస్‌‌ రికార్డింగ్‌‌ కూడా చేయొచ్చు. ఫుడ్‌‌ టైం కాగానే వాటికి ఆ వాయిస్‌‌  వినిపిస్తుంది. దాంతో అవి ఎక్కడున్నా ఫీడర్‌‌‌‌ దగ్గరికి వస్తాయి. 

ధర: 7,600--- రూపాయలు