
క్యాన్బెరా: టూరిస్టులు వదిలేసిన బీర్‌బాటిల్స్ ఓ అడవిపంది కంట పడ్డాయి. దీంతో ఏకంగా 18 బాటిళ్లను పరపరా కొరికేసి అందులోని బీర్‌ను తాగేసింది. ఆ మత్తులో అడవి పంది చేసిన హంగామా స్థానికులకు వినోదాన్ని పంచింది. మత్తుతో తూగుతూ తనకన్నా బలమైన జంతువులను రెచ్చగొడుతూ కయ్యానికి కాలు దువ్వింది. అవి దానిని పట్టించుకోకపోవడంతో ఆ తర్వాత కాస్త రెస్ట్ తీసుకోవడానికి నదిలో ఈత కొట్టింది.
కొంతసేపు హడావిడి చేసి ఓ చెట్టుకింద కుప్పకూలింది. కొన్ని రోజులపాటు ఆ మత్తు ఎఫెక్ట్‌కు ఆ అడవి పంది అక్కడే ఉండిపోయింది. ఆస్ట్రేలియాలోని ఓ క్యాంప్‌సైట్‌లో ఈ ఘటన జరిగింది. అయితే, అది ఎవరికీ హాని చేయలేదని దాని చేష్టలు ప్రత్యక్షంగా చూసినవారు తెలిపారు.