GT vs KKR : ఫర్గుసన్ నిప్పులు.. ఈ సీజన్లో ఫాస్టెస్ట్ బాల్తో రికార్డ్

GT vs KKR : ఫర్గుసన్ నిప్పులు.. ఈ సీజన్లో ఫాస్టెస్ట్ బాల్తో రికార్డ్

కోల్ కత్తా పేస్ బౌలర్ లోకీ ఫెర్గుసన్ గుజరాత్ టైటాన్స్ పై నిప్పులు చెరిగాడు. తన పేస్ తో గుజరాత్ బౌలర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. ఐపీఎల్ 2023 సీజన్ లోనే ఫాస్టెస్ట్ డెలివరీని నమోదు చేశాడు. ఏకంగా 154.1 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో బౌలింగ్ వేశాడు.

ఈ సీజన్ లో ఇదే ఇప్పటివరకు ఫాస్టెస్ట్ డెలివరీ. తాను వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ లో ఫెర్గుసన్ వరుసగా.. 149.0, 154.1, 151.4, 129, 127 కిలో మీటర్ పర్ అవర్ వేగంతో బౌలింగ్ చేశాడు. ఈ మ్యాచ్ లో మొత్తం నాలుగు ఓవర్లు వేసిన ఫెర్గుసన్.. ఒక్క వికెట్ తీయకుండా 40 పరుగులు ఇచ్చుకున్నాడు.