
- బైక్‌పై వెళ్తుండగా పట్టుకున్న డీటీఎఫ్ సిబ్బంది ..
- 4.5 కిలోలు స్వాధీనం
బషీర్‌బాగ్, వెలుగు: ఓ వడ్డీ వ్యాపారీ పార్ట్ టైంగా గంజాయి బిజినెస్ ప్రారంభించాడు. ఒడిశా నుంచి తెచ్చి హైదరాబాద్‌లో గంజాయి విక్రయిస్తున్న అతడిని డీటీఎఫ్ సిబ్బంది పట్టుకున్నారు. మల్లాపూర్ కు చెందిన చెన్న రమేశ్‌గౌడ్(27) వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు. లక్షల్లో సంపాదన ఉన్నప్పటికీ సులువుగా మరింత లాభాలు గడించేందుకు ఆయన దృష్టి గంజాయి వైపు వెళ్లింది. కొన్ని రోజులుగా యూపీ నుంచి గంజాయి తీసుకొచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నాడు.
శుక్రవారం తన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌పై గంజాయితో వెళ్తుండగా సమాచారం అందుకున్న డీటీఎఫ్ సీఐ సావిత్రి ఆధ్వర్యంలో సిబ్బంది నారాయణగూడ వైఎంసీఏ కూడలి వద్ద పట్టుకున్నారు. 4.5 కిలోల గంజాయి, రూ.20 వేలు స్వాధీనం చేసుకున్నారు. రమేశ్‌గౌడ్‌ను రిమాండ్‌కు తరలించినట్లు నారాయణగూడ ఎక్సైజ్ సీఐ కల్పన తెలిపారు.