ఫిడే క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్‌‌‌‌‌‌‌‌: ప్రజ్ఞా, వైశాలి గేమ్స్‌‌ డ్రా

ఫిడే క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్‌‌‌‌‌‌‌‌: ప్రజ్ఞా, వైశాలి గేమ్స్‌‌ డ్రా

సైప్రస్‌‌‌‌‌‌‌‌: ఇండియా గ్రాండ్‌‌‌‌‌‌‌‌ మాస్టర్‌‌‌‌‌‌‌‌ ఆర్‌‌‌‌‌‌‌‌. ప్రజ్ఞానంద.. ఫిడే క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్‌‌‌‌‌‌‌‌లో నాలుగో రౌండ్‌‌‌‌‌‌‌‌ గేమ్‌‌‌‌‌‌‌‌ను డ్రా చేసుకున్నాడు. బుధవారం మథియాస్‌‌‌‌‌‌‌‌ బ్లూబామ్‌‌‌‌‌‌‌‌ (జర్మనీ)తో జరిగిన ఈ గేమ్‌‌‌‌‌‌‌‌ను ప్రజ్ఞా 37 ఎత్తుల వద్ద డ్రాగా ముగించాడు. ఇద్దరు ప్లేయర్లు పదేపదే ఒకే రకమైన ఎత్తులు వేయడంతో గేమ్‌‌‌‌‌‌‌‌లో ముందుకెళ్లలేకపోయారు. ఈ రౌండ్‌‌‌‌‌‌‌‌ తర్వాత రెండు పాయింట్లతో ప్రజ్ఞా నాలుగో ప్లేస్‌‌‌‌‌‌‌‌లో కొనసాగుతున్నాడు. 

ఇతర గేమ్‌‌‌‌‌‌‌‌ల్లో సిందరోవ్‌‌‌‌‌‌‌‌.. ఫాబియానో కరువానపై, అనిష్‌‌‌‌‌‌‌‌ గిరి.. ఆండ్రీ ఎసిపెంకోపై గెలిచారు. సిందరోవ్‌‌‌‌‌‌‌‌ మూడున్నర పాయింట్లతో టాప్‌‌‌‌‌‌‌‌లో ఉండగా, కరువాన (2.5), అనిష్‌‌‌‌‌‌‌‌ గిరి (2) తర్వాతి ప్లేస్‌‌‌‌‌‌‌‌ల్లో ఉన్నారు. విమెన్స్‌‌‌‌‌‌‌‌ సెక్షన్‌‌‌‌‌‌‌‌లో వైశాలి.. అలెగ్జాండ్రా గోరియచికినా మధ్య జరిగిన గేమ్‌‌‌‌‌‌‌‌ డ్రా అయ్యింది. దివ్య దేశ్‌‌‌‌‌‌‌‌ముఖ్‌‌‌‌‌‌‌‌.. జు జినెర్‌‌‌‌‌‌‌‌ చేతిలో ఓటమిపాలైంది.