వీడియో: ఏం క్యాచ్ పట్టావ్ మామ.. మ్యాన్ అఫ్ ది మ్యాచ్ కోసమేగా!

వీడియో: ఏం క్యాచ్ పట్టావ్ మామ.. మ్యాన్ అఫ్ ది మ్యాచ్ కోసమేగా!

క్రికెట్ అంటేనే వినోదం. ప్రత్యక్షంగా అయినా, టీవీలో అయినా మ్యాచ్ చూస్తుంటే కలిగే ఆ అనుభూతే వేరు. కడుపుబ్బా నవ్వడమే కాదు.. కొన్ని భావోద్వేగ ఘటనలు చూస్తున్నప్పుడు దుఃఖం తన్నుకొస్తుంది. ఆ కోవకు చెందిందే ఈ వార్త. ఓ ఫీల్డర్ బౌండరీ వెలుపల పట్టాల్సిన క్యాచ్‌ను.. బౌండరీ లైన్ బయట పట్టి ప్రేక్షకులకు నవ్వులు తెప్పించాడు. ఈ ఫన్నీ ఇన్సిడెంట్ తమిళనాడు ప్రీమియర్ లీగ్‌ (టీఎన్‌పీఎల్)లో చోటు చేసుకుంది. 

టీఎన్‌పీఎల్‌లో భాగంగా సెలమ్ స్పార్టాన్స్, దిండిగల్ డ్రాగన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో సెలెమ్ ఆటగాడు కెవిన్ ఓ భారీ షాట్‌కు ప్రయత్నించగా.. దిండిగల్ ఫీల్డర్ ఆ బంతిని క్యాచ్ పట్టేందుకు ప్రయత్నిస్తాడు. ఆ ప్రయత్నంలో అతడు సక్సెస్ కూడా అవుతాడు. కాకుంటే, బౌండరీ వెలుపల పట్టాల్సిన క్యాచ్‌ను.. బౌండరీ లైన్ బయట పట్టాడు. క్యాచ్ పట్టడానికి.. అతనిచ్చిన ఎలేవేషన్స్ చూసి ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుతారు. 

కనీసం ఆపేందుకు కూడా ప్రయత్నించకుండా.. బౌండరీ లైన్ ధాటి క్యాచ్ పట్టడంతో జట్టు ఆటగాళ్లు కూడా ఆశ్చర్యపోతారు. ఈ వీడియో చూసిన అభిమానులు ఫన్నీ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. "ఏం క్యాచ్ పట్టావ్ మామ.. మ్యాన్ అఫ్ ది మ్యాచ్ కోసమేగా!' అని కొందరు. 'ఇదెక్కడి క్యాచ్ మామ.. మేం ఏడ చూడలే..' అని మరొకొందరు సెటైర్లు పేల్చుతున్నారు. ఈ వీడియోను మీరూ చూసేసి కడుపుబ్బా నవ్వుకోండి.