FIFA World Cup Bottles Ban: ఫుట్‌బాల్ లవర్స్‌కి అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమైక్య (FIFA) గట్టి షాక్ ఇచ్చింది. మరికొద్ది రోజుల్లో స్టార్ట్ కాబోయే మెగా టోర్నీ ఫిఫా వరల్డ్ కప్ 2026 రూల్స్‌లో లాస్ట్ మినిట్‌లో ఊహించని యూ-టర్న్ తీసుకుంది. స్టేడియం లోపలికి ఫ్యాన్స్ రీయుజబుల్ వాటర్ బాటిళ్లను తెచ్చుకోకుండా పూర్తిగా బ్యాన్ విధించింది. మొన్నటి వరకు ఖాళీగా ఉన్న, ట్రాన్స్‌పరెంట్ ఒక లీటర్ ప్లాస్టిక్ బాటిళ్లను అలౌ చేస్తామని చెప్పిన ఫిఫా.. ఇప్పుడు ప్లేయర్స్, అటెండీస్ సేఫ్టీ కోసమే ఈ డెసిషన్ తీసుకున్నామంటూ మాట మార్చింది.
రీజన్ సేఫ్టీనా? లేక బిజినెస్:
ఫిఫా వరల్డ్ కప్ మ్యాచులు జరిగే టైమ్‌లో ఎండలు, హ్యుమిడిటీ (ఉక్కపోత) నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయి. అలాంటి సమయంలో వాటర్ బాటిల్స్ బ్యాన్ చేయడంపై ఫ్యాన్స్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఫిఫాకి అఫీషియల్ స్పాన్సర్ అయిన కోకా-కోలా బ్రాండ్ వాటర్ బాటిళ్లను స్టేడియం లోపల భారీ రేట్లకు అమ్ముకోవడానికే ఈ ప్లాన్ వేశారని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. గత సమ్మర్‌లో జరిగిన క్లబ్ వరల్డ్ కప్‌లో స్టేడియం లోపల ఒక్కో వాటర్ బాటిల్‌కు అక్షరాలా 4 నుంచి 6 డాలర్లు (సుమారు రూ. 330 నుంచి రూ. 500) వసూలు చేశారు. ఇప్పుడు కూడా అదే రేంజ్‌లో దోచుకోవడానికి రెడీ అయ్యారని ఫుట్ బాల్ అభిమానులు ఫైర్ అవుతోంది.
వీళ్లకు మాత్రమే ఎగ్జెంప్షన్:
ఈ కఠినమైన రూల్ నుంచి కొందరికి మాత్రం కాస్త ఊరట లభించింది. చిన్న పిల్లల పాలు (Baby Milk), పేషెంట్ల కోసం స్టెరిలైజ్డ్ వాటర్ తెచ్చుకోవచ్చని ఫిఫా వెల్లడించింది. కానీ మెడికల్ రీజన్స్ వల్ల వాటర్ తెచ్చుకుంటున్నట్టు ఇంగ్లీష్, ఫ్రెంచ్ లేదా స్పానిష్ భాషల్లో ఉన్న అఫీషియల్ మెడికల్ సర్టిఫికెట్ చూపిస్తేనే లోపలికి అలౌ చేస్తారట.
హీట్ మేనేజ్‌మెంట్ కోసం ఫిఫా ప్లాన్స్:
ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫ్యాన్స్ ఇబ్బంది పడకుండా హోస్ట్ సిటీలతో కలిసి కొన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఫిఫా చెప్పింది. స్టేడియం చుట్టుపక్కల మిస్టింగ్ స్టేషన్లు, పెద్ద పెద్ద ఫ్యాన్లు, హైడ్రేషన్ స్టేషన్లు, కూలింగ్ టెంట్లను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. ఫిఫాకి ఎప్పుడూ ఫ్యాన్స్ ఫస్ట్ కాదు.. ఫ్యాన్స్ లాస్ట్.. ప్లేయర్స్ సేఫ్టీ పేరుతో ఫ్యాన్స్ వెల్ఫేర్‌ను పక్కనపెట్టి, ఎక్కువ రేట్లకు వాటర్ బాటిల్స్ అమ్ముకునేందుకే ఈ మాస్టర్ ప్లాన్ వేశారని సపోర్టర్స్ అసోసియేషన్ ప్రతినిధి కామెంట్స్ చేశాడు.
According to emails seen by The Athletic, FIFA have informed World Cup ticket holders that they have updated the code of conduct and the correspondence told fans that “reusable water bottles are no longer permitted at the FIFA World Cup 2026™ stadiums".https://t.co/syXQgOp5u7 pic.twitter.com/0QVrWN4fnM
— The Athletic | Football (@TheAthleticFC) June 3, 2026
