ఇవాళే (జులై 19) ఫిఫా వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మహా సంగ్రామం.. ఫైనల్ ఫైట్‎లో తలపడనున్న అర్జెంటీనా, స్పెయిన్‌

ఇవాళే (జులై 19) ఫిఫా వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మహా సంగ్రామం.. ఫైనల్ ఫైట్‎లో తలపడనున్న అర్జెంటీనా, స్పెయిన్‌

న్యూయార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: ఫిఫా వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మహా సంగ్రామానికి సర్వం సిద్ధమైంది. ఆదివారం అర్ధరాత్రి జరిగే మెగా ఫైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డిఫెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అర్జెంటీనా.. బలమైన స్పెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో తలపడనుంది. ఈ టోర్నీలో అర్జెంటీనా అజేయంగా ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చేరినప్పటికీ ఆ ప్రయాణం అంత సులువుగా సాగలేదు. ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో జరిగిన సెమీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో, ఈజిప్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో జరిగిన ప్రిక్వార్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వెనకబడినా.. అద్భుతంగా పుంజుకుని విజయాలు సాధించింది. 

స్విట్జర్లాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కేప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెర్డే జట్లతో జరిగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్రా టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరకు వెళ్లాయి. కాబట్టి ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా అంతే ఉత్కంఠగా సాగే అవకాశాలున్నాయి. ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అర్జెంటీనా గెలిస్తే ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకోనుంది. ఫుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చరిత్రలో 1958, 1962లో బ్రెజిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరుసగా రెండుసార్లు వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గెలిచింది. ఆ తర్వాత ఏ జట్టుకూ ఈ ఘనత సాధ్యం కాలేదు. ఇప్పుడు అర్జెంటీనా ఆ ఫీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సాధ్యం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 

తన సుదీర్ఘ కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎన్నో రికార్డులు కొల్లగొట్టిన స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లియోనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెస్సీ ఈ రికార్డుపై కన్నేశాడు. కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిలబెట్టుకోవడం కోసం సర్వశక్తులు ఒడ్డుతామని ఇప్పటికే మెస్సీ స్పష్టం చేశాడు. మరోవైపు తమ ఫుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చరిత్రలో రెండోసారి ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేరిన స్పెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గెలవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. 2023 నేషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, 2024 యూరోపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా ఇక్కడి వరకు వచ్చిన తాము కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోనే ఇంటికెళ్తామని కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోడ్రి స్పష్టం చేశాడు. ఈ టోర్నీలో స్పెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రక్షణ శ్రేణి అద్భుతంగా ఆడింది. 

ఆడిన ఏడు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో ప్రత్యర్థులకు ఒక్క గోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాత్రమే సమర్పించుకుంది. సెమీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను 2–0తో ఓడించింది. కేప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెర్డేతో జరిగిన తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను డ్రా చేసుకున్న స్పెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆ తర్వాత పుంజుకున్న తీరు అద్భుతం. స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లామిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యమల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పూర్తి ఫిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఉన్నాడని కోచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పష్టం చేశాడు. గోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కీపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉనై సిమోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తొమ్మిది కీలక గోల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అడ్డుకుని మంచి ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చూపెట్టాడు. ప్రత్యర్థి బలాబలాలను బట్టి డిఫెన్స్, కౌంటర్ ఎటాక్ లేదా నేరుగా దాడి చేయడం లాంటి భిన్నమైన వ్యూహాలను అమలు చేయడంలో స్పెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దిట్ట.