
బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించి ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ కి ఎంత అద్భుతమైన రెస్పాండ్ వచ్చిందో సినీ ప్రేక్షకులు ఇప్పటికీ మరచిపోలేరు. అయితే రీసెంట్ గా ఫిపా ప్రపంచ కప్ ప్రారంభమైన నేపథ్యంలో యంగ్ హీరోస్ రామ్ చరణ్, ఎన్టీఆర్ తన డ్యాన్స్ తో ఉర్రూతలూగించిన వీడియో సాంగ్ కు మరింత క్రియేటివిటీని జోడించి, సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. నాటు నాటు వీడియో సాంగ్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఫుట్బాల్ ఆడుతున్నట్లు క్రియేట్ చేసిన ఈ వీడియో ట్రెండింగ్ లో నిలుస్తోంది. మామూలుగానే ఈ సాంగ్ లో హీరోలు చేసే డ్యాన్స్ అదిరిపోయేటట్టు ఉంటుంది. ఇప్పుడు ఈ ఫుట్ బాల్ ను కూడా జోడించేసరికి నిజంగానే వాళ్లిద్దరూ ఫుట్ బాల్ తో డ్యాన్స్ చేశారా అన్న అనుమానం కలగకమానదు.
ఇక ఫిపా మేనియా ఆర్ఆర్ఆర్ తో పాటు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను కూడా వదల్లేదు. నాటు నాటు సాంగ్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ చేసిన డ్యాన్స్ కు ఫుట్ బాల్ ను జోడించినట్టుగానే బన్ని డ్యాన్స్ కూడా ఫుట్ బాల్ ను జోడించారు. దీంతో అల్లు అర్జున్ డ్యాన్స్ చేస్తూ.. ఫుట్ బాల్ ఆడుతున్నట్టుగా ఈ వీడియోలో కనిపిస్తోంది.