
జీడిమెట్ల, వెలుగు: మహిళ దారుణ హత్యకు గురైన ఘటన బాచుపల్లి పీఎస్ పరిధిలో జరిగింది. నేపాల్‌కు చెందిన కుమార్(22) సిటీకి వచ్చి బాచుపల్లి పరిధి ఇందిరా నగర్‌లోని ఓ హోటల్లో నెలరోజులుగా పనిచేస్తున్నాడు. ఆ హోటల్ వెనుకాలె రూమ్ రెంట్‌కు తీసుకుని ఉంటున్నాడు. గురువారం రాత్రి కుమార్, అతడి ఫ్రెండ్ చింతల్‌కు చెందిన ఓ మహిళ(45)తో మాటలు కలిపి ఆమెను ఇందిరానగర్‌లోని రూమ్‌కు తీసుకెళ్లాడు. అర్ధరాత్రి ఆమెతో గొడవపడి నోటిలో బట్ట కుక్కి ఊపిరాడకుండా చేసి చంపేశారు. ఆ తర్వాత కుమార్, అతడి ఫ్రెండ్ అక్కడికి నుంచి పారిపోయారు. శుక్రవారం ఉదయం కుమార్ పనికిరాకపోవడంతో హోటల్ఓనర్ అతడి రూమ్‌కు వెళ్లి చూడగా.. మహిళ డెడ్ బాడీ కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు అక్కడికి చేరుకుని డెడ్ బాడీని హాస్పిటల్‌కు తరలించారు. పైసల కోసం జరిగిన గొడవ కారణంగానే కుమార్, అతడి ఫ్రెండ్ మహిళను చంపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులు పరారీలో ఉన్నారని.. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.