మణికొండ పోలింగ్ బూత్ బయట విధ్వంసం..

మణికొండ పోలింగ్ బూత్ బయట విధ్వంసం..

మణికొండ పోలింగ్ బూత్ దగ్గర విధ్వంసం జరిగింది. ఇరు పార్టీ నాయకుల మధ్య గొడవ జరగడంతో పోలింగ్ బూత్ బయట ఉన్న కుర్చీలు, టేబుళ్లను ఎక్కడిక్కడ ధ్వంసం చేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. 

రంగారెడ్డి జిల్లా మణికొండలో ఇరు పార్టీల మధ్య గొడవ జరిగింది. పోలింగ్ బూత్ కు సమీపంలో నేతలు డబ్బులు పంచుతున్నారంటూ స్థానికులు ఆరోపించారు. దీంతో ఇరు పార్టీల నేతలు గొడవకు దిగారు. ఈ క్రమంలో నాయకుల మధ్య తోపులాట జరిగింది. దుర్బషలాడుతూ.. ఒకరిపై ఒకరు దాడికి యత్నించారు. దీంతో నాయకులంతా కలసి పోలింగ్ బూత్ దగ్గర ఉన్న టేబుల్, కుర్చీలు ధ్వంసం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నాయి. పోలీసులు వారిని చెదరగొట్టినా వినకపోవడంతో.. వారిపై లాఠీఛార్జ్ చేశారు.