
ఈ రోజుల్లో, చాలా మంది మెరుగైన ఆరోగ్యం కోసం శాకాహారాన్ని తమ ఫుడ్ మెనూలో చేర్చుకుంటున్నారు. జీవనశైలిలో అందుకు తగిన మార్పులనూ చేసుకుంటున్నారు. అందుకే ఆహారంలో పోషకాలు అధికంగా ఉండే శాకాహార సూపర్‌ఫుడ్‌లు తీసుకోవడం చాలా ముఖ్యం. అవి ఎముకలు బలంగా ఉండేందుకు సహాయపడతాయి. అత్తి పండ్ల నుంచి అమర్‌నాథ్ వరకు, బలమైన ఎముకల కోసం తీసుకోవాల్సిన బెస్ నాన్ వెజ్ సూపర్‌ఫుడ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
అత్తిపండ్లు: క్యాల్షియం, మెగ్నీషియం సమృద్ధిగా ఉండే ఈ పండ్లు ఎముకలు ఆరోగ్యంగా, బలంగా ఉండేలా చూస్తాయి. ఆరోగ్యకరమైన ఎముకల సాంద్రతను పెంపొందించడంలో సహాయపడటమే కాకుండా, ఇతర అవసరమైన విటమిన్లు, ఖనిజాలను కూడా అందిస్తాయి.
ALSO READ:వరల్డ్ లోనే ఫస్ట్ టైం.. బిడ్డ మృతదేహాన్ని తిన్న తల్లి కోతి
అమరాంత్: ఈ పురాతన ధాన్యం ప్రోటీన్‌తో నిండి ఉంది. ఇది శాఖాహారులకు పోషకాహారానికి అద్భుతమైన మార్గంగా చెప్పవచ్చు. ఇందులో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ తో పాటు విటమిన్ B, ఇతర ముఖ్యమైన పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి.
సోయాబీన్స్: సోయాబీన్స్ లో ప్రోటీన్స్ తో పాటు ఎముకల ఆరోగ్యానికి అవసరమైన కాల్షియం, ఐరన్, జింక్, మెగ్నీషియం వంటి ఇతర ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. వీటితో పాటు అదనంగా ఐసోఫ్లేవోన్‌ల ను కలిగి ఉంటాయి. ఇవి బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
విత్తనాలు, గింజలు: ఇవి ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, జింక్, మెగ్నీషియం, కాల్షియం వంటి ముఖ్యమైన ఖనిజాలను కలిగి ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి ముఖ్యమైనవి చెప్పవచ్చు. దృఢమైన ఎముకలను నిర్వహించడానికి బాదం, వాల్‌నట్‌లు ప్రత్యేకంగా ఉపయోగపడతాయి.
బ్రోకలీ: బ్రోకలీ ఎముకల ఆరోగ్యానికి ముఖ్యమైన పోషకాలను అందిస్తుంది. విటమిన్ K, మాంగనీస్, ఫాస్ఫరస్, విటమిన్ సి లాంటి మరెన్నో పోషకాలు ఈ శాకాహార ఆహారంలో ఉంటాయి.
బెర్రీస్: బ్లూబెర్రీస్, రాస్ప్‌బెర్రీస్, బ్లాక్‌బెర్రీస్, స్ట్రాబెర్రీస్ వంటి బెర్రీలలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి ఎముకలను రక్షించడంలో సహాయపడతాయి. బెర్రీలలోని విటమిన్ సి కంటెంట్ ఆరోగ్యకరమైన కొల్లాజెన్ ఏర్పడటానికి, ప్రమాదాలను నివారించడానికి సహాయపడుతుంది (ఎముకలను బలంగా ఉంచడంలో కీలకం).
క్వినోవా: క్వినోవా ప్రోటీన్‌తో నిండి ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి అవసరమైన జింక్, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్ వంటి ముఖ్యమైన ఖనిజాలను కలిగి ఉంటుంది. ఇందులో తక్కువ క్యాలరీలు, ఎక్కువ ఫైబర్ ఉంటుంది.
పెరుగు: యోగర్ట్ లో ఉండే కాల్షియం, విటమిన్ డిలు బలమైన ఎముకలను ప్రోత్సహించడానికి సహాయపడతాయి. ఇందులోని ప్రోబయోటిక్స్ బోలు ఎముకల వ్యాధి నుండి రక్షించడంలో సహాయపడతాయి.