త్వరలో వైద్యారోగ్య శాఖలో ఖాళీల భర్తీ

త్వరలో వైద్యారోగ్య  శాఖలో ఖాళీల భర్తీ
  •     సివిల్ అసిస్టెంట్ స‌‌ర్జన్‌‌, ల్యాబ్ టెక్నీషియ‌‌న్‌‌, స్టాఫ్ న‌‌ర్సుల పోస్టులకు నోటిఫికేషన్లు ఇవ్వనున్న సర్కార్​

హైద‌‌రాబాద్‌‌, వెలుగు :  వివిధ ప్రభుత్వ ఆస్పత్రుల్లోని ఖాళీగా ఉన్న సివిల్ అసిస్టెంట్ స‌‌ర్జన్లు, ల్యాబ్ టెక్నీషియ‌‌న్లు, స్టాఫ్ న‌‌ర్సుల పోస్టుల భ‌‌ర్తీకి నోటిఫికేష‌‌న్ల ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రాథ‌‌మిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్‌‌సీ) సివిల్ అసిస్టెంట్ స‌‌ర్జన్ల కొర‌‌త ఎక్కువ‌‌గా ఉంది. ఈ స‌‌మ‌‌స్యను అధిగ‌‌మించి ప్రజ‌‌ల‌‌కు మెరుగైన సేవ‌‌లు అందించేందుకు 531 సివిల్ అసిస్టెంట్ స‌‌ర్జన్ల పోస్టులు భ‌‌ర్తీ చేయాల‌‌ని నిర్ణయించింది. 

ఈ మేర‌‌కు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య సేవ‌‌ల నియామ‌‌క బోర్డు (ఎంహెచ్ఎకస్‌‌ఆర్‌‌బీ) త్వర‌‌లోనే ఈ పోస్టుల భ‌‌ర్తీకి నోటిఫికేష‌‌న్ జారీ చేయ‌‌నుంది. ఆయా పీహెచ్‌‌సీల్లోని డిమాండ్‌‌కు అనుగుణంగా స‌‌ర్జన్లను నియ‌‌మించ‌‌నున్నారు. అలాగే, 193 ల్యాబ్ టెక్నీషియ‌‌న్ పోస్టులతో పాటు 31 స్టాఫ్ న‌‌ర్సుల పోస్టుల‌‌ను కూడా భ‌‌ర్తీ చేయ‌‌నున్నారు.