- బహుజనుల అండతోనే నిలదొక్కుకున్నాను
- సినీ నటుడు సుమన్
పెనుబల్లి, వెలుగు : సినీ ఫీల్డ్ లో ఎదుగుతున్న సమయంలో కొంత మంది తనను తొక్కేయాలని చూశారని సినీ నటుడు సుమన్ అన్నారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వీఎం బంజరు గ్రామంలో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని శనివారం సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయితో కలిసి ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ తన ఎదుగుదలకు బీసీలు, బహుజనులే కారణమని, వారి అభిమానంతోనే ఇంతవాడినయ్యానని తెలిపారు. ఎంత ఎదిగినా వారసత్వ మూలాలు మరవొద్దని, పాపన్న గౌడ్ వారసులుగా గర్వించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు గిరిజపతి, శ్రీనివాస్, విఠల్ రావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.