
తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్, క్రిటిక్ అసోసియేషన్ మరియు పిఆర్వోలు అందరూ కలిసి కోఆర్డినేషన్ కమిటీగా ఏర్పడి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. సినిమా ఓపెనింగ్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ప్రెస్ మీట్స్.. ఇలా చాలా వాటిపై ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకున్నారు.
వాటిలో ముందుగా మూవీ ప్రెస్ మీట్స్ అండ్ మూవీ ఓపెనింగ్స్ కు టైం కేటాయించడం జరిగింది. 7am to 9am కొత్త సినిమాల ఓపినింగ్స్ కోసం స్లాట్ కేటాయించారు. అవసరమైతే.. 9am స్లాట్ కూడా ఓపినింగ్ కూడా వాడుకునేలా సెట్ చేశారు. ఇక ప్రెస్ మీట్స్ కోసం.. 9AM, 11AM, 2PM, 4:30PM, 6.30PM స్లాట్స్ ఉన్నాయి. ఇక ఆదివారం ప్రెస్ మీట్స్ లేకుండా చూడటం వంటివి కూడా ఇందులో యాడ్ చేశారు.
ఇక ప్రీమియర్ షోస్ అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కోసం కూడా టైం స్లాట్స్ ను సెట్ చేశారు. సాయంత్రం 7.30PM తరువాత జరిపేలా స్లాట్ సెట్ చేశారు.
యూట్యూబ్ ఛానెల్స్ & సోషియల్ మీడియా ప్రతినిధుల కోసం ప్రత్యేకంగా ఒక కమిటీ వేసి వాటిని కూడా ఒక పద్దతి లోనికి తీసుకురావడం. వాళ్ళకి ఒక ఐడీ కార్డ్ ఇచ్చి విధంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ కమిటీకి సంబందించిన సభ్యులను రెండు రోజుల్లో ప్రకటించనున్నారు.
ఇక ఫిలిం జర్నలిస్టు సురేష్ కొండేటి హాజరవడంపై కూడా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల జరిగిన వివాదంలో భాగంగా సురేష్ కొండేటి విషయంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) లేటర్ జారీ చేసింది. ఆ కారణంగా కొంతకాలం సురేష్ కొండేటిని ప్రెస్ మీట్ లకు దూరంగా ఉంచాలని, తన సంతోషం తరపున ప్రతినిధి ప్రెస్ మీట్ లో పాల్గొనవచ్చని పిఆర్వోలు అందరూ తమ నిర్ణయం తెలిపారు.