
శ్రియ లీడ్ రోల్‌లో పాపారావు బియ్యాల దర్శకత్వం వహించిన చిత్రం ‘మ్యూజిక్ స్కూల్’. ప్రకాష్ రాజ్, షర్మాన్ జోషి, సుహాసిని ములాయ్, వినయ్ వర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. పదకొండు పాటలతో ఇళయరాజా సంగీతం అందించిన ఈ చిత్రాన్ని మే 12న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. హిందీలో పి.వి.ఆర్, తెలుగులో దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో దిల్ రాజు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను లాంచ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘ఎడ్యుకేషన్ విషయంలో పిల్లలపై ఎంత ప్రెజర్ పడుతుందనేది తెలియజేసే చిత్రమే ‘మ్యూజిక్ స్కూల్’. ఇదొక సీరియస్ పాయింట్ అయినా.. మ్యూజికల్ ఫిల్మ్‌గా చేశారు పాపారావు. శ్రియా శరన్ మెయిన్ లీడ్‌గా, చిన్న పిల్లలతో ఈ సినిమాను చేశారు. ఇళయరాజా సంగీతం హైలైట్ అవుతుంది’ అన్నారు.