కొత్త సినిమాల పోస్టర్స్‌‌తో న్యూ ఇయర్‌‌‌‌కు గ్రాండ్‌‌ వెల్‌‌కమ్

కొత్త సినిమాల పోస్టర్స్‌‌తో న్యూ ఇయర్‌‌‌‌కు గ్రాండ్‌‌ వెల్‌‌కమ్

పాత ఏడాదికి గుడ్ బై చెప్పి, కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టాం. ఎప్పటికప్పుడు కొత్త తరహా కథలు, కమర్షియల్ హంగులతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచే సినిమా ఇండస్ట్రీలో న్యూ ఇయర్ సందడి మొదలైంది. మొదటి వారంలో పెద్ద సినిమాల సందడి లేకున్నా.. సంక్రాంతి సీజన్‌‌ మాత్రం బ్యాక్ టు బ్యాక్ స్టార్‌‌‌‌ హీరోల సినిమాలతో ఊరిస్తోంది. కొత్త క్యాలెండర్‌‌‌‌లో తమ ఫేవరేట్‌‌ స్టార్ సినిమా రిలీజ్‌‌లు ఏయే డేట్స్‌‌లో వస్తాయా సినీ అభిమానులు లెక్కలు వేసుకుంటున్నారు. 

మరోవైపు కొత్త సినిమాల పోస్టర్స్‌‌తో న్యూ ఇయర్‌‌‌‌కు గ్రాండ్‌‌ వెల్‌‌కమ్ చెప్పారు ఫిల్మ్ మేకర్స్. స్టార్స్ సినిమా మొదలు చిన్న సినిమాల వరకూ.. న్యూ ఇయర్ విషెస్ చెబుతూ నయా పోస్టర్స్‌‌ను విడుదల చేశారు. తమ ఫేవరేట్ హీరోల పోస్టర్లను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ న్యూ ఇయర్‌‌‌‌ను సెలబ్రేట్ చేసుకుంటున్నారు అభిమానులు. 

వాటిలో ముఖ్యంగా మహేష్​ బాబు ‘గుంటూరు కారం’, నాగార్జున ‘నా సామిరంగ’, రవితేజ ‘ఈగల్’,  వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలంటైన్’, సిద్దు జొన్నలగడ్డ ‘టిల్లు స్క్వేర్’, విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’, గోపీచంద్ ‘భీమా’, అంజలి ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’, ఆనంద్ దేవరకొండ ‘గంగం గణేశా’తో పాటు కోలీవుడ్‌‌ నుంచి విజయ్ ‘ది గ్రేటెస్ట్‌‌ ఆఫ్ ఆల్‌‌ టైమ్‌‌’, శివకార్తికేయన్ ‘అయలాన్‌’.. మలయాళం నుంచి మమ్ముట్టి ‘భ్రమయుగం’ పోస్టర్స్ ఇంప్రెస్ చేస్తున్నాయి.