బీటెక్లో 11,638 సీట్లు మిగిలినయ్..ముగిసిన ఎప్సెట్ ఫైనల్ ఫేజ్  సీట్ల అలాట్మెంట్ 

బీటెక్లో 11,638 సీట్లు మిగిలినయ్..ముగిసిన ఎప్సెట్ ఫైనల్ ఫేజ్  సీట్ల అలాట్మెంట్ 
  • 80,011 మందికి సీట్లు
  • 51 కాలేజీల్లో వంద శాతం ఫుల్

హైదరాబాద్, వెలుగు: టీజీ ఎప్ సెట్  ఫైనల్  ఫేజ్  సీట్ల అలాట్ మెంట్  ప్రక్రియ ముగిసింది. మొత్తం 87.3 శాతం మందికి సీట్లు అలాటయ్యాయి. ఈ మేరకు టెక్నికల్  ఎడ్యుకేషన్  కమిషనర్  శ్రీదేవసేన ప్రకటించారు. బీటెక్  ఫస్టియర్​లో మొత్తం 180 కాలేజీల్లో 91,649 సీట్లు ఉండగా.. 80,011 మందికి ఫైనల్  ఫేజ్  వరకూ సీట్లు అలాటయ్యాయి. కేవలం ఫైనల్ ఫేజ్​లో 40,837 మంది వెబ్ ఆప్షన్లు ఇవ్వగా, వారిలో 20,028 మంది కాలేజీలు మారారు. మరో 4,720 మందికి కొత్త సీట్లు కేటాయించారు.

సీట్లు పొందిన అభ్యర్థులు ఈనెల 12 లోగా సెల్ఫ్ రిపోర్టు చేయాలని, 13 లోగా కాలేజీల్లో రిపోర్టు చేయాలని అధికారులు సూచించారు. కాగా, కోస్గి గవర్నమెంట్ కాలేజీలో 198 సీట్లలో 56 నిండాయి. ఇక 21 యూనివర్సిటీ సీట్లలో 6,462 సీట్లుంటే 4669 సీట్లు భర్తీ అయ్యాయి. రెండు ప్రైవేటు వర్సిటీల్లో 1386 సీట్లకు 1379 సీట్లు నిండగా, 156 ప్రైవేటు కాలేజీల్లో 83,603 సీట్లకు 73,907 సీట్లు ఫిలప్  అయ్యాయి. బీటెక్  ఫస్టియర్​లో ఇంకా 11638 సీట్లు మిగిలాయి. కాగా, 51 కాలేజీల్లో వంద శాతం సీట్లు నిండాయి. 

ప్రధాన బ్రాంచుల్లో సీట్ల వివరాలు

కోర్సు                                   సీట్లు           భర్తీ        ఖాళీ 

సీఎస్ఈ                             30,678        28,787      1,891
సీఎస్ఈ (ఏఐఎంఎల్)   15,189        14,167      1,022
ఈసీఈ                               12,193        10,225      1,968 
సీఎస్ఈ (డేటాసైన్స్)    8,318            7,424         894 
ఈఈఈ                             4,990             3,349       1,641
ఐటీ                                   4,143             3,704           439
సివిల్  ఇంజినీరింగ్    3,718               2,613    1,105 
మెకానికల్                     3,457                2,150     1,307