బీ ఫార్మసీలో 96% మందికి సీట్లు..ఎప్సెట్ బైపీసీ ఫైనల్ ఫేజ్ సీట్ల అలాట్మెంట్ పూర్తి

బీ ఫార్మసీలో 96%  మందికి సీట్లు..ఎప్సెట్ బైపీసీ ఫైనల్ ఫేజ్ సీట్ల అలాట్మెంట్ పూర్తి

హైదరాబాద్, వెలుగు: టీజీ ఎప్​సెట్ బైపీసీ విద్యార్థుల ఫైనల్ ఫేజ్ సీట్ల అలాట్మెంట్ పూర్తయింది. బీఫార్మసీ, ఫార్మా డీ తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన కౌన్సెలింగ్​ లో  96.67% మందికి సీట్లు కేటాయించినట్టు కళాశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన తెలిపారు. మొత్తం 16,336 మంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో పాల్గొనగా, వారిలో 15,192 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. మొత్తం 10,960 సీట్లకుగానూ..10,595 మందికి సీట్లు అలాట్ అయ్యాయి.118 బీఫార్మసీ కాలేజీల్లో 8,908 సీట్లు ఉంటే 8,175 (95.92%) సీట్లు నిండాయి.

 రాష్ట్రంలో 74 ఫార్మా డీ కాలేజీల్లో 1,682 సీట్లుంటే 1671 మందికి, బయోమెడికల్ ఇంజినీరింగ్​లో , బయోటెక్నాలజీలో వందశాతం సీట్లు నిండాయి. ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్​లో 116 సీట్లుంటే 110 సీట్లు అలాట్ అయ్యాయి. ఈడబ్ల్యూఎస్ కోటాలో 536 మందికి సీట్లు కేటాయించారు. మొత్తం 68 కాలేజీల్లో వందశాతం సీట్లు నిండాయి.