- మెదక్ జిల్లాలో మొత్తం 87,185 మంది ఓటర్లు
మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట వెలుగు: రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మెదక్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా ఫైనల్ ఓటర్ లిస్ట్ లను ఆయా మున్సిపల్ కమిషనర్లు సోమవారం విడుదల చేశారు. మెదక్, తూప్రాన్, రామాయంపేట, నర్సాపూర్ మున్సిపాలిటీల్లో కలిపి మొత్తం 87,185 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 42,015 మంది, మహిళలు 45,168 మంది, ఇతరులు ఇద్దరు ఉన్నారు. మెదక్ జిల్లాలోని మున్సిపాలిటీలకు సంబంధించిన ఓటర్ల గణాంకాలు వెల్లడయ్యాయి.
మెదక్ మున్సిపాలిటీలో మొత్తం 36,955 మంది ఓటర్లు ఉండగా, ఇందులో పురుషులు 17,548 మంది, మహిళలు 19,406 మంది, ఇతరులు 1 మంది ఉన్నారు. తూప్రాన్ మున్సిపాలిటీలో మొత్తం 20,259 మంది ఓటర్లు నమోదు కాగా పురుషులు 9,957 మంది, మహిళలు 10,302 మంది ఉండగా ఇతరులు లేరు. రామాయంపేట మున్సిపాలిటీలో మొత్తం 13,095 మంది ఓటర్లు ఉండగా పురుషులు 6,291 మంది, మహిళలు 6,804 మంది ఉండగా ఇతరులు నమోదు కాలేదు. నర్సాపూర్ మున్సిపాలిటీలో మొత్తం 16,876 మంది ఓటర్లు ఉండగా పురుషులు 8,219 మంది, మహిళలు 8,656 మంది, ఇతరులు 1 మంది ఉన్నారు.
సంగారెడ్డి జిల్లాలో 83, 668 మంది ఓటర్లు
సంగారెడ్డి జిల్లాలో మొత్తం 11 మున్సిపాలిటీలు, 263 వార్డులకు త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఫైనల్ ఓటర్ లిస్ట్ ప్రకటించారు. సంగారెడ్డి మున్సిపాలిటీలో 38 వార్డులు ఉండగా మొత్తం 83,668 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 41,579 మంది, స్త్రీలు 42,081 మంది, ఇతరులు 8 మంది ఉన్నారు. ఇస్నాపూర్ మున్సిపాలిటీలో 26 వార్డులకు గాను మొత్తం 35,192 మంది ఓటర్లు ఉండగా పురుషులు 18,778 మంది, స్త్రీలు 17,133 మంది, ఇతరులు 1 మంది ఉన్నారు.
ఇంద్రేశం మున్సిపాలిటీలో 18 వార్డుల్లో మొత్తం 13,086 మంది ఓటర్లు నమోదు కాగా పురుషులు 6,519 మంది, స్త్రీలు 6,566 మంది, ఇతరులు 1 మంది ఉన్నారు. గుమ్మడిదల మున్సిపాలిటీలో 22 వార్డులకు గాను 23,926 మంది ఓటర్లు ఉండగా పురుషులు 12,022 మంది, స్త్రీలు 11,901 మంది, ఇతరులు 3 మంది ఉన్నారు. జహీరాబాద్ మున్సిపాలిటీలో 37 వార్డులు ఉండగా మొత్తం 78,819 మంది ఓటర్లు నమోదు కాగా పురుషులు 39,352 మంది, స్త్రీలు 39,467 మంది ఉన్నారు.
కోహిర్ మున్సిపాలిటీలో 16 వార్డులకు గాను మొత్తం 10,832 మంది ఓటర్లు ఉండగా పురుషులు 5,465 మంది, స్త్రీలు 5,366 మంది ఉన్నారు. అందోల్-జోగిపేట మున్సిపాలిటీలో 20 వార్డుల్లో మొత్తం 16,450 మంది ఓటర్లు ఉండగా పురుషులు 7,886 మంది, స్త్రీలు 8,564 మంది ఉన్నారు. నారాయణఖేడ్ మున్సిపాలిటీలో 15 వార్డులకు గాను 17,675 మంది ఓటర్లు నమోదు కాగా పురుషులు 9,051 మంది, స్త్రీలు 8,622 మంది, ఇతరులు 2 మంది ఉన్నారు.
గడ్డపోతారం మున్సిపాలిటీలో 18 వార్డుల్లో మొత్తం 11,983 మంది ఓటర్లు ఉండగా పురుషులు 6,287 మంది, స్త్రీలు 5,696 మంది ఉన్నారు. జిన్నారం మున్సిపాలిటీలో 20 వార్డులకు గాను 12,475 మంది ఓటర్లు నమోదు కాగా పురుషులు 6,061 మంది, స్త్రీలు 6,413 మంది, ఇతరులు 1 మంది ఉన్నారు. సదాశివపేట మున్సిపాలిటీలో 26 వార్డులు ఉండగా మొత్తం 36,982 మంది ఓటర్లు ఉండగా పురుషులు 18,151 మంది, స్త్రీలు 18,829 మంది, ఇతరులు 2 మంది ఉన్నారు.
సిద్దిపేట జిల్లాలో
సిద్దిపేట జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లోనే ఓటరు జాబితాలను అధికారులు విడుదల చేశారు. జిల్లాలో నాలుగు మున్సిపాల్టీల్లో ఎన్నికల నిర్వహణకు రంగం సిద్దం చేసినా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాల్టీ ఓటరు జాబితాను వెల్లడించలేదు. దీంతో జిల్లాలోని దుబ్బాక హుస్నాబాద్, చేర్యాల మున్సిపాల్టీల్లోని ఓటరు జాబితాలను మాత్రమే సోమవారం వెల్లడించారు. జిల్లాలోని మూడు మున్సిపాల్టీల పరిధిలో మొత్తం 54,345 మంది ఓటర్లుండగా ఇందులో పురుషులు 26,230, మహిళలు 28,109 , ఇతరులు ఆరుగురు ఉన్నారు.
మున్సిపాల్టీల వారీగా చూస్తే దుబ్బాకలో మొత్తం 23,341 మంది ఓటర్ల లో పురుషులు 10,224, మహిళలు11,117 చేర్యాలలో మొత్తం 13,772 మంది ఓటర్లుండగా పురుషులు 6658, మహిళలు 7119 మంది ఉన్నారు. హుస్నాబాద్ మున్సిపాల్టీలో మొత్తం 19,227 మంది ఓటర్లకు గాను పురుషులు 9348, మహిళలు 9873 మంది ఉన్నారు. గజ్వేల ప్రజ్ఞాపూర్ మున్సిపాల్టీ ఓటర్ల జాబితాల విడుదల పై ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాకపోవడంతో పెండింగ్ లో పెట్టినట్టు తెలుస్తోంది.
