పాలమూరు జిల్లాలో ఫైనల్​ ఓటర్​ లిస్ట్​ రిలీజ్

పాలమూరు జిల్లాలో ఫైనల్​ ఓటర్​ లిస్ట్​ రిలీజ్
  •     ఉమ్మడి పాలమూరు జిల్లాలో 32,81,593 ఓటర్లు

మహబూబ్​నగర్, వెలుగు : అసెంబ్లీ ఎలక్షన్ల నేపథ్యంలో ఎన్నికల అధికారులు ఓటరు తుది జాబితాను రిలీజ్ చేశారు. బుధవారం సాయంత్రం ఆయా జిల్లాల కలెక్టర్లు వివరాలను అందజేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 అసెంబ్లీ సెగ్మెంట్లలో 32,81,593 ఓటర్లు ఉన్నారు. కొడంగల్​లో పురుషులు 1,14,140 మంది, మహిళలు 1,16,099, ట్రాన్స్​జెండర్లు12 మంది, సర్వీస్ ఓటర్లు 164 మందితో కలుపుకొని 2,30,415 మంది ఓటర్లు ఉన్నట్లు తేల్చారు. నారాయణపేటలో పురుషులు 1,12,697 మంది, మహిళలు 1,14,668 మంది, ట్రాన్స్ జెండర్స్ ఇద్దరు, సర్వీస్ ఓటర్లు 165 మందితో కలుపుకొని 2,27,532 మంది, మహబూబ్​నగర్​లో పురుషులు 1,21,397 మంది, మహిళలు 1,21,960 మంది ట్రాన్స్ జెండర్స్  10 మంది, సర్వీస్  ఓటర్లు 322 మందితో కలుపుకొని 2,43,689 మంది ఓటర్లు ఉన్నారు.

జడ్చర్లలో పురుషులు 1,06,922 మంది, మహిళలు 1,05,469, ట్రాన్స్ జెండర్స్ నలుగురు, సర్వీస్ ఓటర్లు 260 మందితో కలుపుకొని 2,12,655 ఓటర్లు, దేవరకద్రలో పురుషులు 1,13,528, మహిళలు 1,14,556, ట్రాన్స్ జెండర్స్ ఇద్దరు, సర్వీస్ ఓటర్లు 197 మందితో కలుపుకొని 2,28, 281 మంది ఓటర్లు ఉన్నారు. మక్తల్​లో పురుషులు 1,17,576, మహిళలు 1,21,009, ట్రాన్స్ జెండర్స్ ఒకరు, సర్వీస్ ఓటర్లు 63 మందితో కలుపుకొని 2,38,649 మంది, వనపర్తిలో పురుషులు 1,32,971, మహిళలు 1,32,644, ట్రాన్స్ జెండర్స్ ఏడుగురు, సర్వీస్ ఓటర్లు 221 మందితో కలుపుకొని 2,65,843,  గద్వాలలో పురుషులు 1,29,7673, మహిళలు 1,29,096, ట్రాన్స్ జెండర్స్  10  మంది, సర్వీస్ ఓటర్లు 34 మందితో కలుపుకొని 2,53,903 మంది

అలంపూర్​లో పురుషులు 1,16,989, మహిళలు 1,19,080, ట్రాన్స్ జెండర్స్ 72, సర్వీస్ ఓటర్లు 60 మంది కలుపుకొని 2,36,136 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు.  నాగర్​కర్నూల్​లో పురుషులు 1,12,657 మంది, మహిళలు 1,11,971, ట్రాన్స్​జెండర్స్ 03, సర్వీస్ ఓటర్లు 233 మందితో కలుపుకొని 2,24,864 మంది, అచ్చంపేటలో పురుషులు 1,17,124, మహిళలు 1,16,439, ట్రాన్స్ జెండర్స్ ఇద్దరు, సర్వీస్ ఓటర్లు 173 మందితో కలుపుకొని 2,33,738 మంది, కల్వకుర్తిలో పురుషులు 1,17,393 మంది, మహిళలు 1,13,250, ట్రాన్స్ జెండర్స్ ఏడుగురు, సర్వీస్ ఓటర్లు 134 మందితో కలుపుకొని 2,30,784 మంది

షాద్​నగర్​లో పురుషులు 1,13,872 మంది, మహిళలు 1,11,583 మంది ట్రాన్స్ జెండర్స్ 15 మంది, సర్వీస్ ఓటర్లు 54 మందితో కలుపుకొని 2,25,524 మంది, కొల్లాపూర్​లో పురుషులు 1,16,975 మంది, మహిళలు 1,12,420 మంది, ట్రాన్స్ జెండర్స్ నలుగురు, సర్వీస్ ఓటర్లు 181 మందితో కలుపుకొని 2,29,580 మంది ఓటర్లు ఉన్నారు. ఆయా జిల్లాల్లో తుది ఓటర్  జాబితాను వివిధ రాజకీయ పార్టీల నాయకులకు అందజేశారు.