గోల్డ్లోన్ లెక్కలు చెప్పాలి..బ్యాంకులకు ఆర్థికశాఖ నోటీసు

గోల్డ్లోన్ లెక్కలు చెప్పాలి..బ్యాంకులకు ఆర్థికశాఖ నోటీసు

బంగారంపై రుణాలకు సంబంధించిన లెక్కలు చెప్పాలని అన్ని ప్రభుత్వ బ్యాంకులకు కేంద్ర ఆర్థిక శాఖ నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ నిబంధనలు  పాటిం చని కారణంగా తమ బంగారు రుణాల పోర్ట్ ఫోలియోను సమీక్షించాలని బ్యాంకులను కోరింది. ఆర్థిక మంత్రిత్వ శాఖలో భాగమైన ఆర్థిక సేవల విభాగం (DFS).. బంగారు రుణాలకు సంబందించిన విధి విధానాలను పరిశీలించాల్సిందిగా ప్రభుత్వ రంగ బ్యాంకులకు లేఖ రాసింది. 

జనవరి 1,2022 తర్వాత చేయబడిన ప్రతి గోల్డ్ లోన్ ఖాతాను అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు తప్పనిసరిగా పరిశీలించాలని ఆదేశించింది. ఈ ఖాతాలలలో ని తాకట్టు విలువ, సేకరణ ఛార్జీలను అధ్యయనం, రుణాల పొడిగింపుపై సమీక్ష నిర్వహించాలని కోరింది. గతేడాదితో పోలిస్తే బంగారు రుణాలు పెరిగిన క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. 

2024 జనవరి 26 నాటికి బంగారు ఆభరణాలపై రుణాలు రూ. 1.01 లక్షల కోట్లకు చేరుకున్నాయి. బంగారం ధరలలో 16.6 శాదతం పెరుగుదలతోపాటు, గతేడాదితో పోలిస్తే 17 శాతం పెరిగింది.  అయితే గోల్డ్ లోన్ విషయంలో బ్యాంకులు నిబంధనలు పాటించడం లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అందుకే రుణాలపై రివ్యూ కోరామని తెలిపింది. 

దేశంలో అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) డిసెంబర్ 2023 నాటికి రూ. 30,881 కోట్ల గోల్డ్ లోన్ ఇచ్చింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్  రూ. 5,315కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా రూ.3,682 కోట్లు బంగారు రుణాలను మంజూరు చేశాయి. 

ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. బ్యాంకులు లేదా గోల్డ్ లోన్ ఫైనాన్స్ సంస్థలు ఆభరణాల విలువలో 75 శాతం వరకు మాత్రమే రుణం ఇవ్వడానికి అనుమతి ఉంది. అయితే కోవిడ్ సమయంలో సడలింపులు కూడా ఇచ్చారు. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆప్ ఇండియా IIFL ఫైనాన్స్ లిమిటెడ్ పై పరిమితులను విధించింది. బంగారు రుణాలను మంజూరు చేయకుండా నిషేధించింది. 

IIFL  ఫైనాన్స్ గోల్డ్ లోన్ ఖాతాలలో గణనీయంగా గోల్డ్ లోన్ టు వ్యాల్యూ రేషియోలో అవకతవకలు, రుణగ్రహీతల డిఫాల్ట్ ల కారణంగా అధిక సంఖ్యలో ఖాతాలలు వేలానికి వెళ్లాయని ఆర్బీఐ ఇటీవలి ఆడిట్ లో హైలైట్ చేసింది.