ధరలను కంట్రోల్లో ఉంచగలిగాం : పీయూష్ గోయెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ధరలను కంట్రోల్లో ఉంచగలిగాం : పీయూష్ గోయెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • ఎన్నికల టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆహార పదార్ధాల రేట్లు పెద్దగా పెరగవు: పీయూష్ గోయెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ :  ఉల్లిపాయల నుంచి ఉప్పు, పప్పు వరకు  అన్ని ఆహార పదార్ధాల  రేట్లను తగ్గించడంపై పనిచేస్తున్నామని కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ పేర్కొన్నారు. తాత్కాలికంగా  రేట్లు పెరగకుండా మోదీ ప్రభుత్వం కంట్రోల్ చేయగలిగిందని అన్నారు. ఎన్నికల టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  అత్యవసరమైన ఆహార పదార్ధాల రేట్లు పెద్దగా పెరగవని ధీమా వ్యక్తం చేశారు.  ఫుడ్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కంట్రోల్ చేసేందుకు గత కొన్నేళ్లలో  రూ.28 వేల కోట్లను ఖర్చు చేశామని, ప్రైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టెబిలైజేషన్ ఫండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేశామని  వివరించారు. దేశంలోని మహిళలకు అండగా ఉంటున్నామని, కుటుంబాల ఖర్చులు పెరగకుండా చూసుకుంటున్నామని గోయెల్ అన్నారు.  మిగిలిన దేశాలన్నీ  పెరిగిన ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఇబ్బంది పడినా, ఇండియా మాత్రం చక్కగా కంట్రోల్ చేయగలిగిందని పేర్కొన్నారు.