
న్యూఢిల్లీ: అండ్రాయిడ్ మొబైల్ ఎకోసిస్టమ్‌లో తన ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేసిందని పేర్కొంటూ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) రూ.1,337 కోట్ల జరిమానా విధించడాన్ని నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీల్యాట్) సమర్థించింది. ఈ మొత్తాన్ని నెలలోపు డిపాజిట్ చేయాలని టూ మెంబర్ బెంచ్ ఆదేశించింది. సీసీఐ ఆదేశాలు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయన్న గూగుల్ వాదనను తోసిపుచ్చింది. అయితే సీసీఐ ఇచ్చిన 10 ఆదేశాల్లో కొన్నింటిని మార్చింది. నాలుగు రూల్స్‌ను గూగుల్‌కు అనుకూలంగా సవరించింది. ఇక నుంచి గూగుల్ తన ప్లేస్టోర్‌లో థర్డ్‌పార్టీ యాప్ స్టోర్స్‌ను హోస్ట్ చేయాలి.