అధిక ఫీజుల వసూలు ఆరోపణలు.. 15 ఇంజనీరింగ్ కాలేజీలపై ఫైన్

అధిక ఫీజుల వసూలు ఆరోపణలు.. 15 ఇంజనీరింగ్ కాలేజీలపై ఫైన్

అధిక ఫీజులు వసూలు చేస్తున్న దాదాపు 15 ఇంజనీరింగ్ కాలేజీలపై  తెలంగాణ అడ్మిషన్స్, ఫీజుల నియంత్రణ కమిటీ జరిమానా విధించింది. ఒక్కో కాలేజీపై  రూ.2 లక్షలు చొప్పున జరిమానా వేసింది. అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయంటూ 26 కాలేజీల పై  తెలంగాణ అడ్మిషన్స్, ఫీజుల నియంత్రణ కమిటీకి ఫిర్యాదులు అందాయి. 

దీంతో ఆయా కళాశాలల నిర్వాహకులను  పిలిచి కమిటీ విచారించింది.  ఎంతమంది విద్యార్థుల వద్ద  అధిక ఫీజులు వసూలు చేశారనే దానిపై  ప్రశ్నించింది. అభియోగాలను ఎదుర్కొన్న మొత్తం 26 కాలేజీల్లో 15 కళాశాలలపై ఫైన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది.