మాది పక్షపాతి బడ్జెట్ కాదు... విపక్షాలవి అసత్య ఆరోపణలు.. నిర్మల సీతారామన్ కౌంటర్

మాది పక్షపాతి బడ్జెట్ కాదు... విపక్షాలవి అసత్య ఆరోపణలు.. నిర్మల సీతారామన్ కౌంటర్

కేంద్ర బడ్జెట్ పై లోక్ సభలో అధికార ప్రతిపక్షాల మధ్య రచ్చ కొనసాగుతూనే ఉంది. కేంద్ర బడ్జెట్లో కేవలం ఏపీ, బీహార్ రాష్ట్రాలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారని ఎన్డీయేపై విపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి.ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ విపక్షాల ఆరోపణలను తిప్పికొట్టారు.ఏ రాష్ట్రానికి ప్రత్యేకంగా ప్రయోజనం చేకూర్చలేదని క్లారిటీ ఇచ్చారు.

విపక్షాలు అసత్య ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. 2009-10 బడ్జెట్‌లో 26 రాష్ట్రాల ప్రస్తావనే లేదని గుర్తు చేశారు. 2010-11 బడ్జెట్‌లో 19 రాష్ట్రాలను విస్మరించారని.. మరి దానికేం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. 2009-10లో కూడా బీహార్‌కు అధికంగా నిధులు కేటాయించారని.. రెండు రాష్ట్రాలపై ఆరోపణలు చేస్తున్న విపక్షాలు దీనికేం సమాధానం చెబుతాయని ప్రశ్నించారు నిర్మల సీతారామన్.

యూపీఏ ప్రభుత్వ హయాంలో దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలను విస్మరించారని, అప్పుడు గుర్తుకు రాని వివక్ష.. ఇప్పుడెందుకు గుర్తొస్తోందని అన్నారు. ఒక సామాన్య ఛాయ్ వాలా దేశాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తోంటే విపక్షాలకు  నచ్చటంలేదని కౌంటర్ ఇచ్చారు నిర్మల సీతారామన్.