సంతోషకర దేశాల లిస్టులో 136వ స్థానంలో భారత్

సంతోషకర దేశాల లిస్టులో 136వ స్థానంలో భారత్

ప్రపంచంలోనే అత్యంత సంతోషకర దేశాల్లో ఫిన్లాండ్ మరోసారి ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. మార్చి 20 వరల్డ్ హ్యాపీనెస్ డేను పురస్కరించుకుని యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్.. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2022 రిలీజ్ చేసింది. లిస్టులో  మొత్తం146 దేశాలు ఉండగా.. భారత్ 136 వ స్థానంతో సరిపెట్టుకుంది. గతేడాదితో పోలిస్తే ఇండియా మూడు స్థానాలు మెరుగవడం విశేషం.

వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్లో ఫిన్లాండ్ ఫస్ట్ ప్లేస్లో నిలవడం వరుసగా ఇది మూడోసారి.  డెన్మార్క్ రెండోస్థానాన్ని  నిలుపుకోగా.. ఐస్ ల్యాండ్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్, లగ్జంబర్గ్, స్వీడన్, నార్వే, ఇజ్రాయెల్, న్యూజిలాండ్ లిస్టులో టాప్ 10 కంట్రీస్గా నిలిచాయి. అగ్రరాజ్యం అమెరికా గతేడాదితో పోలిస్తే మూడు స్థానాలు మెరుగుపరుచుకుని 16వ స్థానంలో నిలిచింది. 2021లో  19వ  స్థానంలో ఉన్న  చైనా.. ఈసారి 72వ ర్యాంకుకు పడిపోయింది. లెబనాన్, జింబాబ్వే, రువాండా అత్యల్ప సంతోషకర దేశాలు కాగా.. ఆఫ్ఘనిస్తాన్ లిస్టులో అట్టడుగున నిలిచింది. 

మరిన్ని వార్తల కోసం..

బీహార్ మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు

కేంద్ర నిధులతోనే తెలంగాణ అభివృద్ధి