
- మొబీక్విక్ వాలెట్ నుంచి డబ్బు చెల్లింపు
హైదరాబాద్, వెలుగు: బ్యాంకు ఖాతాను యూపీఐకి లింక్ చేయకుండానే డబ్బు పంపే విధానాన్ని ఫిన్‌టెక్ కంపెనీ వన్ మొబీక్విక్ సిస్టమ్స్ లిమిటెడ్ (మొబీక్విక్) తీసుకొచ్చింది. ఇందుకోసం దాని ప్లాట్‌ఫారమ్‌లో 'పాకెట్ యూపీఐ' అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. దీనివల్ల బడ్జెట్, ఫైనాన్స్ మేనేజ్‌మెంట్‌పై నియంత్రణ సాధ్యపడుతుంది.
పాకెట్ యూపీఐ వినియోగదారులు వారి బ్యాంక్ అకౌంట్ లింక్ చేయకుండా మొబీక్విక్ వాలెట్ ద్వారా యూపీఐతో డబ్బు చెల్లించవచ్చు. కస్టమర్లు తమ అవసరాలకు అనుగుణంగా వాలెట్‌ను టాప్ అప్ చేయవచ్చు. క్రెడిట్ కార్డ్‌లు, డెబిట్ కార్డ్‌లు లేదా యూపీఐ ద్వారా వాలెట్లో డబ్బు వేసుకోవచ్చు. రూపే, వీసా, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, డైనర్స్ క్లబ్‌తో సహా అన్ని నెట్‌వర్క్‌ల నుంచి కార్డ్ చెల్లింపులను తీసుకుంటుంది.