
రంగారెడ్డి జిల్లాలో ఘోర అగ్నిప్రమాగదం జరిగింది. మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాపూర్ ఆర్సిఐ రోడ్ లో ఒక్కసారిగా కార్లో మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన డ్రైవర్ కారు పక్కకు ఆపి బయటకు దూకాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనపై ఫైర్ పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు.
అకస్మాత్తుగా కారులో నుంచి మంటలు రావడంతో వాహనదారులు భయబ్రాంతులకు గురయ్యారు. కారులో ఎవ్వరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.