బీహార్ మంత్రి బంగళాలో అగ్ని ప్రమాదం

బీహార్ మంత్రి బంగళాలో అగ్ని ప్రమాదం

పాట్నా: బీహార్ రాష్ట్ర చిన్ననీటిపారుదల శాఖా మంత్రి సంతోష్ కుమార్ అధికారిక బంగళాలో బుధవారం అగ్నిప్రమాదం జరిగింది. పాట్నా నగరంలోని స్ట్రాండ్ రోడ్డులో ఉన్న ఆయన అధికారిక నివాసం గ్రౌండ్ ఫ్లోర్ లో హఠాత్తుగా మంటలు లేచాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పారు. షార్ట్ సర్క్యూట్ వల్లనే మంటలు లేచి ఉంటాయని అనుమానిస్తున్నారు. 
ఈ ప్రమాదం పట్టపగలు జరిగింది. పొగలు వ్యాపించి ఇంట్లోని విలువైన ఫర్నీచర్, బట్టలు, వస్తువులు తగుగలబడినట్లు గుర్తించారు. ఎలాంటి ప్రాణానష్టం జరగలేదు. మంటలు ప్రారంభమైన వెంటనే మంత్రి ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ హుటాహుటిన బయటకు వచ్చేశారు. ఉదయం 8 గంటల సమయంలో మంత్రి సతీమణి దీపా మాంఘి, కుమారుడు ఆదిత్య కుమార్తె గౌరియా తదితరులు ఇంట్లో ఎక్కడో ఏదో తగలబడుతున్నట్లు వాసన చూసి పసిగట్టారు. గ్రౌండ్ ఫ్లోర్ లో పొగలు వ్యాపించడం గమనించి వెంటనే ఇంట్లో నుంచి బయటకు వచ్చారు. అగ్నిమాపక సిబ్బందికి సమారం ఇవ్వగా వారు వచ్చి కొన్ని గంటలపాటు శ్రమించి మంటలు ఆర్పేశారు. ఈలోగా మంత్రి సంతోష్ కుమార్ ఇంటికి తిరిగొచ్చి ప్రమాదంపై ఆరా తీశారు. షార్ట్ సర్క్యూట్ వల్లనే మంటలు చెలరేగి ఉంటాయని అనుమానం వ్యక్తం చేశారు.