హైదరాబాద్ ORRపై కారులో మంటలు ..క్షణాల్లో కాలి బూడిదైంది

హైదరాబాద్ ORRపై  కారులో మంటలు ..క్షణాల్లో కాలి బూడిదైంది

హైదరాబాద్​ ఔటర్​ రింగ్​ రోడ్డుపై అగ్నిప్రమాదం జరిగింది. రన్నింగ్ లో ఉన్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు గుర్తించిన కారులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు అప్రమత్తమై  కిందకు దిగడంతో పెద్ద ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే..  

ALSO READ : రాంగ్ రూట్లో వచ్చి బస్సును ఢీకొట్టింది ఇతడే

శుక్రవారం(అక్టోబర్​24)  హైదరాబాద్​ ఔటర్​ రింగ్​ రోడ్డుపై అగ్నిప్రమాదం జరిగింది. సిద్దిపేట నుంచి హైదరాబాద్​ కు కొందరు వ్యక్తులు ఫంక్షన్​కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్​ ORR పై కి రాగానే ఒక్కసారిగి మంటలు చెలరేగాయి. గమనించిన అందులో ప్రయాణిస్తున్న వ్యక్తులు వెంటనే కారు దిగడంతో పెద్ద ప్రమాదం తప్పింది. చూస్తూండగనే కారు మంటల్లో పూర్తిగా కాలిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని మంటలార్పారు.